Big Stories

Jupiter and Earth : జూపిటర్, ఎర్త్ మధ్య కొత్త పోలికలు కనిపెట్టిన ఆస్ట్రానాట్స్..

Jupiter and Earth

- Advertisement -

Jupiter and Earth : భూమికి, అంతరిక్షంలోని ఇతర గ్రహాలకు పోలికలు ఏంటి అని ఆస్ట్రానాట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ భూమి అనేది ఎప్పుడైనా మానవాళి జీవనానికి సపోర్ట్ చేయకపోతే ఇంకే ఇతర గ్రహంలో మానవాళి జీవనం కొనసాగవచ్చు అని తెలుసుకోవడం కోసమే. అలా చేసే పరిశోధనల్లోనే వారు ఎన్నో కొత్త విషయాలను కనుక్కుంటారు. తాజాగా అలాంటి పరిశోధనల్లోనే భూమికి, జుపిటర్‌కు ఉండే పోలికను కనుక్కున్నారు.

- Advertisement -

ఇటీవల కాలంలో జూపిటర్ గురించి తరచూ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అందుకే ఆస్ట్రానాట్స్ కూడా ఆ గ్రహంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. తాజాగా భూమిపై ఏర్పడిన విధంగానే జూపిటర్‌లో కూడా ఉరుములు, మెరుపులు ఏర్పడతాయని వారు కనుగొన్నారు. అంతే కాకుండా భూమిపై అవి ఎలాంటి ఆకారాల్లో కనిపిస్తాయో అంతరిక్షంలో కూడా అచ్చం అలాంటి ఆకారాల్లోనే కనిపిస్తాయని వారి పరిశోధనల్లో బయటపడింది.

భూమి కనిపించినట్టుగానే జూపిటర్‌పై అదే ఆకారంలో ఉరుములు, మెరుపులు కనిపించడం వెనుక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందేమో తెలుసుకోవడానికి ఆస్ట్రానాట్స్ ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో ఒకవేళ జూపిటర్‌పై గ్రహంతరవాసులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం వారిలో మొదలయ్యింది. ఈ రెండు గ్రహాలపై కూడా ఉరుములు, మెరుపులు అనేవి ఒకేవిధంగా గ్యాప్ తీసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. అందుకే ఈ రెండు గ్రహాల మధ్యలో మరిన్ని పోలికలు తెలుసుకోవడం కోసమే వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

జూపిటర్‌పై ఇలాంటి ఉరుములు, మెరుపులు కలగడానికి కారణం జోవియన్ క్లౌడ్స్ అని ఆస్ట్రానాట్స్ అనుమానపడినా.. ఇవి గ్రహంతరవాసుల కదలికలవల్ల కాదు అని చెప్పడం కూడా పూర్తిగా అసాధ్యమని అంటున్నారు. రేడియో వేవ్స్ ద్వారా భూమిపైనే కాకుండా జూపిటర్‌లో కూడా ఏర్పడిన ఉరుములు, మెరుపులను ఆస్ట్రానాట్స్ క్యాప్చర్ చేశారు. ఆపై వాటిపై స్టడీలు మొదలుపెట్టారు. ఈ రెండు గ్రహాలలో ఉరుములు, మెరుపులు అనేవి ఎంత దూరం ట్రావెల్ చేస్తాయో వారు కనుక్కున్నారు. అందులోనూ పెద్దగా తేడాలు లేవని వారు బయటపెట్టారు. చివరిగా ఈ రెండు గ్రహాల మధ్య ఉరుములు, మెరుపులు ఒకేలా ఉన్నాయని వారు నిర్ధారణకు వచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News