EPAPER
Kirrak Couples Episode 1

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

iPhone 15: మతిపోగొట్టే ఆఫర్.. జస్ట్ రూ.15,650కే ఐఫోన్ 15, ఎలా కొనాలో తెలుసా?

Amazon Offers On Apple iPhone 15: మొబైల్ ఫోన్లను ఇష్టపడే వాళ్ల డ్రీమ్ ఆపిల్ ఐఫోన్. ఎన్ని ఫోన్లు కొనుగోలు చేసినా, ఆపిల్ ఫోన్ కు ఉండే క్రేజ్ మరో లెవల్. మధ్య తరగతి మొబైల్ వినియోగదారులు సైతం ఐఫోన్ వాడాలని ఆశపడుతుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సూపర్ డూపర్ ఆఫర్ అందిస్తోంది. ఊహించని డిస్కౌంట్ లో ఐఫోన్ 15ను సొంత చేసుకునే అవకాశం కల్పిస్తోంది.


రూ. 15,650కే ఐఫోన్ 15

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తాజాగా ఐఫోన్ 16 సిరీస్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 15 (128 జిబి, బ్లాక్)ను కేవలం రూ. 15,650కే అందిస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలంటే కొన్ని కండీషన్స్ పెట్టింది. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..


ఆపిల్ ఐఫోన్ 15 అమెజాన్ సేల్ డీల్

ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15(128 GB, బ్లాక్) అమెజాన్‌ లో రూ. 79,600కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మీద అమెజాన్ 12% తగ్గింపు అందిస్తోంది. అంటే.. దాని ధర రూ. 69,900కి తగ్గింది. మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ ను తిరిగి ఇచ్చేస్తే మరో రూ. 48,750 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ ధర రూ.21,150కి చేరుతుంది.  SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు EMI ద్వారా కొనుగలు చేస్తే మరో రూ. 5,500 వరకు తగ్గింపు పొందవచ్చు. చివరకు ఐఫోన్ 15 కేవలం రూ. 15,650కి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Read Also:భారత్‌లో ఈ రైల్వే స్టేషన్ చాలా స్పెషల్, ఫ్లాట్ ఫారమ్ మీదకి వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే!

iPhone 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డిస్ ప్లే, డిజైన్: ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్‌ ప్లేను కలిగి ఉంది. పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్స్ లో లభిస్తున్నది. పాత మోడల్ నుంచి అప్ డేట్ అయిన ఈ ఫోన్ గతంలో మాదిరి సాంప్రదాయ నాచ్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్  కలిగి ఉంది. ఇది ఐఫోన్ 14 ప్రోలో మంచి ఆదరణ దక్కించుకుంది.

అప్డేటెడ్ కెమెరా: ఐఫోన్ 15 మోడల్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. తక్కువ లైట్ ఉన్నా, ఫోటోలను అద్భుతంగా తీసుకునే అవకాశం ఉంది.

బ్యాటరీ లైఫ్: ఐఫోన్ 15ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా ఉంటుంది. నిరంతరాయంగా వాడితో సుమారు 9 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

ప్రాసెసర్: ఐఫోన్ 15 మోడల్ A16 బయోనిక్ చిప్ ద్వారా రన్ అవుతుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లో A15 చిప్ ఉండగా, ఇందులో అప్ డేట్ అయ్యింది.

ఛార్జింగ్ పోర్ట్: ఐఫోన్ 14 USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ ను కలిగి ఉంది. గత మోడళ్లలో ఉపయోగించిన లైట్నింగ్ పోర్ట్‌ ఇది రీప్లేస్ అయ్యింది.

Read Also: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

Related News

Iphone 15 : పండగ సేల్ ఆఫర్​​ – ఐఫోన్​ 15, ఐఫోన్ 13పై కళ్లు చెదిరే డిస్కౌంట్​!

Samsung : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Amazon Great India Festival Sale 2024 : సామ్ సాంగ్ మెుబైల్స్ మరీ ఇంత చౌకా.. దిమ్మతిరిగే డీల్స్ మీకోసం!

Meta AR Glasses: ఇక స్మార్ట్‌ఫోన్ అవసరం ఉండదు.. ప్రపంచంలోనే తొలి ఏఐ కంటి అద్దాలు వచ్చేశాయ్!

Redmi Note 14 Pro Plus: రెడ్ మి నోట్ ప్రొ ప్లస్ వచ్చేస్తోంది బ్రో.. ఫీచర్స్ కిర్రాక్‌గా ఉన్నాయ్‌గా

Vivo V40e Launched: వివో టైం ఆగయా.. కిర్రాక్ ఫీచర్లతో బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్, అదిరిపోయిందంతే!

Big Stories

×