EPAPER

Top Selling Smartphones: ఆల్ టైమ్ రికార్డ్.. అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే.. ఎందుకంటారు?

Top Selling Smartphones: ఆల్ టైమ్ రికార్డ్.. అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు ఇవే.. ఎందుకంటారు?

Top Selling Smartphones: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ ఇటీవలే ప్రైమ్ డే సేల్‌తో సందడి చేసింది. ఈ సేల్ ప్రముఖ బ్రాండెడ్ ఉత్పత్తులను తక్కువ ధరకే అందించింది. ప్రైమ్ డే సేల్ జులై 20 న ప్రారంభమై 21 న ముగిసింది. అయితే అమోజాన్ ఇప్పుడు ఓ ప్రకటన చేసింది. సేల్‌లో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాను వెల్లడించింది. దీని ప్రకారం ఈ సేల్‌లో ఆపిల్, సామ్‌సంగ్, వన‌ప్లస్ ఫోన్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 13, శామ్‌సంగ్ గెలాక్సీ S23 5G, వన్‌ప్లస్ 12R ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యధికంగా కొనుగోలు చేశారు. ఈ సేల్‌లో ఈ ఫోన్‌లను ఎంత ధరకు కొనుగోలు చేశారంటే అమెజాన్ సేల్‌లో డిస్కౌంట్ తర్వాత iPhone 13 రూ. 47,999కి విక్రయించారు. అయితే సామ్‌సంగ్ Galaxy S23 Ultra సేల్‌లో రూ. 74,999కి విక్రయించారు. వన్‌ప్లస్ 12R బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 39,998కి విక్రయించారు.

OnePlus 12R
OnePlus 12R 6.7 అంగుళాల ఓరియెంటెడ్ AMOLED LTPO స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 16GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రన్ అవుతుంది. OnePlus 12R మూడు బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్, ఇది f/1.8 లెన్స్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో వస్తుంది. అంతేకాకుండా ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5,500mAh బ్యాటరీ ఉంటుంది.


Samsung Galaxy S23 5G
Samsung S23 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X స్క్రీన్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ అడ్రినో 740 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 CPUతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. IP68 రేటెడ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ 3,900mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇది 50MP OIS మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ + 10MP 3x టెలిఫోటో బ్యాక్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Also Read: iPhone Offers: ఆపిల్ బిగ్ గిఫ్ట్.. భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు.. ఎందుకో తెలుసా?

iPhone 13
iPhone 13 ఫోన్‌లో 6-కోర్ ఏ15 బయోనిక్ సిపియు ఉంది. డివైస్‌లో 3240ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 13 డిస్ప్లే డాల్బీ విజన్, హెచ్‌ఎల్‌జి, హెచ్‌డిఆర్ 10 కంటెంట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం  f/1.6 ఎపర్చరు, సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్‌తో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2.4 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Related News

Bsnl Recharge Plan: వావ్ అమేజింగ్.. ఇంత తక్కువ ధరకే అన్ని రోజుల వ్యాలిడిటీనా, రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది!

Honor Magic V3: బీభత్సం.. హానర్ ఏంటి భయ్యా ఒకేసారి ఇన్ని లాంచ్ చేసింది, ధర సహా పూర్తి వివరాలివే!

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Vivo T3 Ultra: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Poco M7 Pro 5G: పోకో నుంచి మరో కిక్కిచ్చే ఫోన్.. సామాన్యుల కోసం వచ్చేస్తుంది మావా!

Vivo Y300 Pro: వివో నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో లాంచ్!

Moto S50 Launched: మోటో మామ అదరగొట్టేశాడు.. 50MP కెమెరా సహా మరెన్నో అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్!

Big Stories

×