Big Stories

AI in Indian Languages : ఇండియన్ భాషల్లో ఏఐ.. ప్రయత్నాలు మొదలు..

- Advertisement -

AI in Indian Languages : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లను ఏఐ టార్గెట్‌గా పెట్టుకొని.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. అందుకే ఇప్పుడు మెల్లగా ఇతర దేశాలపై కూడా ఏఐ సంస్థల దృష్టిపడింది. ముఖ్యంగా ఇండియాను తన స్థావరంగా మార్చుకోవాలని పలు ఏఐ సంస్థలు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా బెంగుళూరు నుండి తాము అనుకున్న పనిని మొదలుపెట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇప్పటికే బెంగుళూరులో గూగుల్ ఏఐ ల్యాబ్ అనేది ఏర్పాటయ్యింది. ఇప్పుడు ఈ ల్యాబ్ అనేది 100కు పైగా ఇండియన్ భాషల్లో ఏఐను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏఐ మోడల్స్‌తో పాటు పలు గూగుల్ ప్రొడక్ట్స్‌ను కూడా ఇండియన్ భాషల్లో ప్రవేశపెట్టాలని ఈ ఏఐ ల్యాబ్ నిర్ణయించుకుంది. బార్డ్ లాంటి ఏఐ మోడల్ కూడా ఇండియన్ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ ప్రకటించారు.

ఏఐ మోడల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రతీ యూజర్‌కు చేరువ చేయడమే వారి టార్గెట్ అని డైరెక్టర్ బయటపెట్టారు. ముందుగా 16 ఇండియన్ భాషలను సపోర్ట్ చేసేలాగా ఏఐ మోడల్స్‌ను తయారు చేశామని, ఇప్పుడు 100కు పైగా భాషల్లో చేయాలని అనుకుంటున్నామని ప్రకటించారు. గూగుల్ అసిస్టెంట్ కూడా ప్రస్తుతం చాలావరకు ఇండియన్ భాషలకు సపోర్ట్ చేస్తుందని గుర్తుచేసుకున్నారు. అందుకే గూగుల్ అసిస్టెంట్ లాగా బార్డ్ కూడా పలు ఇండియన్ భాషలకు సపోర్ట్ చేసేలా మారాలని సన్నాహాలు చేస్తున్నారు.

2019లో గూగుల్ బెంగుళూరులో తన స్థావరాన్ని స్థాపించింది. ప్రారంభించి కొన్నేళ్లే అయినా కూడా చాలావరకు టార్గెట్లను ఈ ల్యాబ్ సాధించింది. ప్రస్తుతం ఇండియన్ భాషల్లో గూగుల్ ప్రొడక్ట్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం కోసం యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఇండియాలోని పలు జిల్లాల నుండి 773 భాషల శాంపుల్స్‌ను కలెక్ట్ చేసింది. ఇదంతా చేయడం కోసం గూగుల్ ఏఐ ల్యాబ్ బెంగుళూరు.. యాజమాన్యంతో పాటు ఉద్యోగులకు కూడా సాయంగా ఉంటుందని డైరెక్టర్ ప్రకటించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News