Big Stories

AI:- ఆస్ట్రానమీలో ఏఐ.. తొలి ప్రయత్నంలోనే కొత్త గ్రహం గుర్తింపు..

AI:- ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గురించే. ఏఐ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అనుకునేవారు ఒకవైపు. కాదు దానివల్ల అన్ని సాధ్యం కాదు అనుకునేవారు మరొకవైపు. అందుకే భూమి కాకుండా ఇతర గ్రహాలను గుర్తించడానికి ఏఐ సాయం తీసుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో ఏఐ సక్సెస్ సాధించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

- Advertisement -

సోలార్ సిస్టమ్ బయట ఉండే కొత్త గ్రహాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) కనిపెట్టి చూపించింది. ఇప్పటివరకు ఏఐ సాధించిన ఎన్నో ఘనతల్లో ఇది ముఖ్యమైనది అని టెక్ నిపుణలు గర్వంగా చెప్తున్నారు. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఈ విషయం వైరల్‌గా మారింది. ఇతర గ్రహాన్ని కనుక్కోవడానికి ఆస్ట్రానాట్స్‌కు ఉపయోగపడిన ఏఐను మరికొన్ని పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని వారు భావిస్తున్నారు. మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌లోనే ఇదొక సంచలనం అని అంటున్నారు.

- Advertisement -

ఆస్ట్రానమిలో ఏఐ వేసిన మొదటి అడుగులే గుర్తుండిపోయేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు గర్వపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఇంకా ఎన్నెన్నో సాధించగలదు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్తున్నారు. కేవలం ఆస్ట్రానమీ ప్రపంచంలోనే కాదు.. ఇతర రంగాల్లో కూడా ఏఐ ఏదైనా సాధించగలదని వారు నమ్మకంగా ఉన్నారు. ఏఐ కంటే ముందుగా సోలార్ సిస్టమ్ బయట ఉండే గ్రహాల గురించి తెలుసుకోవడానికి ఆస్ట్రానాట్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఏఐ మాత్రం దానిని సులువుగా కనిపెట్టేసిందని తెలిపారు.

తాజాగా కనిపెట్టిన కొత్త గ్రహంతో పాటు సోలార్ సిస్టమ్ బయట దాదాపు 500 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా బయటపడిన గ్రహం హెచ్డీ 142666 అనే స్టార్‌కు దగ్గరలో ఉన్నట్టుగా వారు గమనించారు. ఈ గ్రహం గురించి శాస్త్రవేత్తలకు ఇదివరకే అవగాహన ఉన్నా.. ఇది సరిగ్గా ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన క్రెడిట్ మాత్రం ఏఐకే దక్కింది. ముందుగా ఏఐ ఈ గ్రహాన్ని కనిపెట్టిన తర్వాత అది నిజమా కాదా అన్న వివరాలు తెలుసుకోవడానికి కేవలం గంట మాత్రమే పట్టిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News