EPAPER

Gas Station In Space:- స్పేస్‌లో గ్యాస్ స్టేషన్.. స్టార్టప్ వినూత్న ఆలోచన..

Gas Station In Space:- స్పేస్‌లో గ్యాస్ స్టేషన్.. స్టార్టప్ వినూత్న ఆలోచన..


Gas Station In Space:- ఒకప్పుడు స్పేస్‌లో కాళు పెట్టడం చాలా పెద్ద విషయం. ఆ తర్వాత అక్కడ పరిశోధనలు చేయడం అసాధ్యం.. ఇలా ఎన్నో అనుకునేవారు. కానీ ఇప్పుడు.. ఏకంగా అక్కడ సంవత్సరాల తరబడి ఉంటూ పరిశోధనలు చేస్తున్నారు. దానికి టెక్నాలజీ కూడా ఆస్ట్రానాట్స్‌కు ఎంతగానో సహాయపడుతోంది. అయితే ఇప్పుడు చేస్తున్న పరిశోధనలు చాలవు కానీ.. స్పేస్‌లో ఏకంగా భవన నిర్మాణాలు, గ్యాస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆస్ట్రానాట్స్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆస్ట్రానాట్స్ అంతరిక్ష ప్రయాణానికి వెళ్లేముందు వారికి అవసరమైన అన్ని వస్తువులను వారితో తీసుకెళ్తారు. అందులోనే ఫ్యూయల్ కూడా ఒకటి. ఈ ఫ్యూయల్‌ను వారు సరిపడా మోతాదులోనే తీసుకెళ్తారు. ఒకవేళ ఎక్స్‌ట్రా ఫ్యూయల్‌ను తీసుకెళ్లాలన్నా దానికి భారీగానే ఖర్చు అవుతుంది. అందుకే 2018లో ఏర్పడిన ఆర్బిట్ ఫ్యాబ్ అనే స్టార్టప్ స్పేస్‌లోనే గ్యాస్ స్టేషన్‌ను తయారు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చింది. ఆలోచన మంచిదే అయినా దాని వెనుక ఎన్నో సన్నాహాలు చేయాల్సి ఉంటుంది.


ముందుగా స్పేస్‌లో గ్యాస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలంటే మైక్రోగ్రావిటీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అయితే ఈ పరిశోధనల్లో ఆర్బిట్ ఫ్యాబ్‌కు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నేషనల్ లేబురేటరీ సాయంగా నిలవనుంది. ఇప్పటికే స్పేస్‌పై గ్యాస్ స్టేషన్ ఏర్పాటు అనే ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆర్బిట్ ఫ్యాబ్. అది కూడా ఒక స్టార్టప్ ఇలాంటి ఆలోచనతో ముందుకు రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పలువురు ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు.

ఆర్బిట్ ఫ్యాబ్ దృష్టిపెడితే స్పేస్‌లోనే సప్లయింగ్ కంపెనీగా ఎదగగలదని, ఆ నమ్మకం తమకు ఉందని ఐఎస్ఎస్ నేషనల్ ల్యాబ్ తెలిపింది. అందుకే వారికి సాయంగా నిలబడడానికి ముందుకొచ్చామని చెప్పింది. ప్రస్తుతం మైక్రోగ్రావిటీలో గ్యాస్ స్టేషన్ ఏర్పాటు ఎలా జరుగుతుంది అనే విషయంపై ఆర్బిట్ ఫ్యాబ్ పనిచేస్తుందని బయటపెట్టింది. గ్యాస్ సప్లై చైన్‌ను ఏర్పాటు చేయాలంటే ముందుగా ట్యాండ్ డైనమిక్స్, పంప్ సిస్టమ్స్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయగలగాలి. ఈ ప్రయోగాలు సక్సెస్ అవ్వగానే వీటిని కమర్షియల్ దిశగా మార్చాలని ఐఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

One Plus 13 : ఇదెక్కడి డిజైన్ బాసూ.. మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ తో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్!

 Google Theft Protection : గూగుల్ థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌.. ఎలా పని చేస్తుంది వివరాలివే!

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Vivo X200 Pro Mini : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

Amazon : ఐఫోన్స్, వాచెస్ పై భారీ డిస్కౌంట్ బ్రదర్… డోంట్ మిస్ ఇట్!

Google Chrome : గూగుల్‌ క్రోమ్‌లో ఈ సూపర్​ ఫీచర్‌ గురించి తెలుసా? – ఎంచక్కా అన్నీ చదివి వినిపించేస్తుంది!

Movie Gen AI : కొత్త సాంకేతికతకు ప్రాణం పోసిన మెటా.. ఏం అనుకుంటున్నారో మాటల్లో చెబితే వీడియో ఇచ్చేస్తుంది!

×