BigTV English

Study About Meat: మాంసాన్ని స్టడీ చేసే కొత్త పద్ధతి.. క్వాలిటీ కోసం..

Study About Meat: మాంసాన్ని స్టడీ చేసే కొత్త పద్ధతి.. క్వాలిటీ కోసం..

Study About Meat: ఆహార పదార్థాల విషయంలో అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం శుభ్రంగా కనిపించినా కూడా అది అవయవాలకు ఎలాంటి హాని కలిగిస్తుందో తెలియడం లేదు. ముఖ్యంగా మాంసం వంటి ఆహార పదార్థాలు విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అది శుభ్రంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నిక్‌తో ముందుకొచ్చారు.


మాంసం అనేది శుభ్రంగా లేకపోయినా.. కుళ్లిపోయినా.. అది తిన్నవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే దానిని టెస్ట్ చేయడానికి ఫుడ్ సెక్యూరిటీ వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ఫుడ్ ఆథెంటికేషన్ టెస్టింగ్ లేబురేటరీ అయిన బియా ఆనలైటికల్ ఒక కొత్త పద్ధతిలో మాంసం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు సక్సెస్ కూడా అయ్యాయి. వారు తయారు చేసిన ఈ టెక్నాలజీ కొత్త సంచలనాన్ని సృష్టిస్తుందని బియా ఆనలైటికల్ అంటోంది.

కేవలం మాంసం అనే కాదు.. ఇతర ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా వాటిని వినియోగించవచ్చా లేదా అన్న విషయాన్ని ఈ కొత్త రకం టెక్నాలజీతో కనిపెట్టవచ్చని బియా ఆనలైటికల్ తెలిపింది. గత పదేళ్లుగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని కనిపెట్టడం కోసమే ఈ సంస్థ కష్టపడుతోంది. ఈ టెక్నాలజీ కేవలం మాంసం ఏ జంతువుకు చెందింది అని మాత్రమే కాకుండా దాని బ్రీడ్ ఏంటి, ఆ మాంసం తయారీ ఎక్కడ జరిగింది, అది ఆర్గానికా కాదా, అది పాడవ్వడానికి ఎన్ని రోజులు సమయం ఉంది అనే విషయాలను తెలిసేలా చేస్తుంది.


కేవలం ఒక్క టెస్ట్ ద్వారా మాంసానికి సంబంధించిన ఇన్ని విషయాలు తెలియడం ఇదే మొదటిసారి. అందుకే ఈ టెక్నాలజీని గ్రౌండ్ బ్రేకింగ్ అని బియా ఆనలైటికల్ సంస్థ పేర్కొంది. మామూలుగా మాంసం గురించి తెలియాలంటే దాని నుండి చిన్న శాంపుల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీతో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మాంసానికి సంబంధించిన సమాచారమంతా కనిపెట్టవచ్చు. ఈ టెస్ట్ రిజల్ట్ కూడా కేవలం నిమిషాల్లోనే బయటపడుతుంది.

ప్రస్తుతం మనిషికి ప్రతీ పనిలో తోడుగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఈ టెక్నాలజీని కనిపెట్టడంలో బియా ఆనలైటికల్‌కు తోడుగా నిలిచింది. ఈరోజుల్లో ఆహార పదార్థాల సప్లై పెరిగిపోయింది. అందుకే సంస్థలకు కూడా మంచి ఆహారాన్ని డెలివరీ చేయాలన్నా ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే వాటి క్వాలిటీని టెస్ట్ చేసి, రిజల్ట్‌ను తొందరగా చూపించే ఇలాంటి ఒక టెక్నాలజీ ఎంతైనా అవసరమని బియా ఆనలైటికల్ సంస్థ ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు.

Related News

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Big Stories

×