EPAPER

5G Smart phones:- 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ.. వారే టార్గెట్…

5G Smart phones:- 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ.. వారే టార్గెట్…


5G Smart phones:-పెరుగుతున్న టెక్నాలజీ వేగాన్ని అందుకోవాలని మనుషులు ప్రయత్నిస్తున్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తోనే ప్రపంచాన్ని ఏలేయాలి అనుకుంటున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు, టెలికాం సంస్థలు.. వారి యూజర్ల కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే టెలికాం సంస్థలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ మరీ.. కస్టమర్లకు స్పీడ్ సేవలు అందించడానికి ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం ఉపయోగపడే పరికరం ఒకటి మార్కెట్లోకి వచ్చింది.

ఇప్పటికే చిప్ మేకింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ మీడియాటెక్.. 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం ఒక సరికొత్త చిప్‌ను తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘డైమెన్సిటీ 7050’ పేరుతో కొత్త చిప్‌సెట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇండియాలోని 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం ఈ చిప్‌సెట్ ఉపయోగపడనుందని సంస్థ ప్రకటించింది. ఇండియాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ లావా.. ఇప్పటికే మీడియాటెక్‌తో చేతులు కలిపి డైమెన్సిటీ 7050 చిప్‌తో స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలని నిర్ణయించుకుంది.


అగ్ని 2 5జీ పేరుతో డైమెన్సిటీ 7050 చిప్‌తో లావా ఒక కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్లు మరింత మెరుగ్గా పనిచేస్తాయని మీడియాటెక్ వెల్లడించింది. సీపీయూ పర్ఫెర్మెన్స్ మెరుగుపడడం, తక్కువ పవర్‌తో పనిచేయడం, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ సూపర్‌గా ఉండడంతో పాటు చూడడానికి కూడా ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు స్లిమ్‌గా, లైట్‌గా ఉండేలా తయారు చేయబడతాయని తెలుస్తోంది.

ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లలో పెద్దగా గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏదీ అందించలేకపోయింది. అందుకే గేమ్స్‌ను ఇష్టపడేవారిని టార్గెట్ చేస్తూ ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు తయారు కానున్నాయి. దీంతో పాటు హై క్వాలిటీ ఫోటోలను తీయడంలో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని తెలుస్తోంది. డైమెన్సిటీ 7050లో 200 ఎమ్పీ ఫోటోస్ సపోర్ట్, 4కీ హెడీఆర్ వీడియోలు, వైఫై 6, మెరుగైన 5జీ లాంటి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని మీడియాటెక్ సంస్థ బయటపెట్టింది.

Tags

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Big Stories

×