Big Stories

3D bioprinting Soon:- 3డి బయోప్రింటింగ్‌ను మించే టెక్నాలజీ.. త్వరలోనే..

3D bioprinting Soon:- 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది టెక్ ప్రపంచంలోనే ఓ సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయారు. టెక్ దిగ్గజాలు ఈ కాన్సెప్ట్‌ను పలు రకాలుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా హెల్త్ రంగంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది పలు విధాలుగా ఉపయోగపడింది. ఇప్పుడు అంతకు మించిన టెక్నాలజీ తెరపైకి రానుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

మనిషి శరీర భాగాలను, అందులోని ప్రతీ కణాన్ని క్షుణ్ణంగా చూపించడానికి 3డి టెక్నాలజీ చాలా ఉపయోగపడింది. కానీ వాతావరణ మార్పులు చూపించడానికి , ప్రకృతిలోని మార్పులు అదే విధంగా చూపించడానికి 3డి టెక్నాలజీ సహకరించలేదు. దీనికోసమే మరో కొత్త టెక్నాలజీ సిద్ధమవుతోంది. అది 4డి బయోప్రింటింగ్ టెక్నాలజీ.

- Advertisement -

3డి బయోప్రింటింగ్ టెక్నాలజీలో ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే సౌలభ్యం లేదు. కానీ 4డి బయోప్రింటింగ్‌లో ఆ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే కణాలను పరీక్షించే విధంగా 4డిలో మరికొన్ని అప్లికేషన్స్‌ను జతచేయనున్నారు. 4డి టెక్నాలజీ సమస్యలను తనంతట తానుగా పరిష్కరించుకోగలదు. పైగా వాతావరణ మార్పులకు తగినట్టుగా రూపం మార్చుకోగలదు.

ప్రస్తుతం పరిస్థితుల్లో 4డి టెక్నాలజీని తయారు చేయడం కష్టమైనా దానికి శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 4డి బయెప్రింటింగ్ టెక్నాలజీపై పరిశోధనలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోయినా.. బయోఫ్యాబ్రికేషన్ రంగంలో మాత్రం 4డి పరిశోధనలు ఊపందుకున్నాయి. దీని వల్ల 4డి బయోప్రింటింగ్ టెక్నాలజీపై కూడా టెక్ దిగ్గజాల దృష్టిపడింది. అందుకే 4డి బయోప్రింటింగ్ రానున్న సంవత్సరాల్లో ఎనలేని ఆదరణ లభించనున్నట్టు తెలుస్తోంది.

4డి బయోప్రింటింగ్ టెక్నాలజీకి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. దీనిని మించిన టెక్నాలజీ వస్తే 4డి బయోప్రింటింగ్ టెక్నాలజీకి డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా 4డి టెక్నాలజీ సిద్ధమయిన తర్వాత దీనికి తగినట్టుగా ప్రైస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని 4డి బయోప్రింటింగ్ టెక్నాలజీ మార్కెట్‌లో నిలబడుతుందో లేదో తెలియాలంటే ముందుగా దీనిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం ముఖ్యం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News