EPAPER

Vettaiyan First Review : ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ… రజినీ వివాదాస్పద మూవీ ఎలా ఉందంటే?

Vettaiyan First Review : ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ… రజినీ వివాదాస్పద మూవీ ఎలా ఉందంటే?

Vettaiyan First Review : సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)  హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇటీవల కాలంలో పలు వివాదాలలో చిక్కుకున్న ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా రజినీకాంత్ అభిమానులను మెప్పించేలా ఉందా? అసలు మూవీ టాక్ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి.


‘వేట్టయన్’ ఎలా ఉందంటే?

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘వేట్టయన్ ; ద హంటర్’. (Vettaiyan) లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్, అభిరామి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్ కారణంగా ‘వేట్టయన్’ ఎలా ఉంది అనే టాక్ బయటకు వచ్చింది.


రజినీకాంత్ 170 సినిమా కావడంతో ‘వేట్టయన్’పై అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ఈ మూవీ రావడం కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ 1 గంట 20 నిమిషాల 34 సెకండ్లు ఉండగా, సెకండ్ హాఫ్ 1 గంట 22 నిమిషాల 50 సెకండ్ల రన్ టైమ్ తో వచ్చింది. మొత్తంగా చూసుకుంటే దాదాపు మూడు గంటల సినిమా.. కానీ పేక్షకులను అంతసేపు థియేటర్లలో కూర్చోబెట్టడంలో ఫెయిల్ అయ్యారు. అంతే కాకుండా డైరెక్టర్ జ్ఞానవేల్ స్టైల్ లో ఈ సినిమా లేకపోవడం, కమర్షియల్ అంశాలు జోడించడమే సినిమాకు మైనస్ అయినట్టుగా తెలుస్తోంది. ‘జై భీమ్’ తరువాత ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు ‘వేట్టయన్’లో కన్పించలేదని అంటున్నారు. పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ను సినిమా ఇంప్రెస్ చేయలేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక సినిమా ఫస్ట్ రివ్యూలే ఇంత దారుణంగా ఉంటే మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ తలైవాకే తెలియాలి. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ సినిమాలో కంటెంట్, చెప్పుకోదగ్గ అంశాలేవీ లేకపోవడం రజినీకాంత్ అభిమానులను నిరాశపరిచే విషయం. మొత్తానికి టాక్ చూస్తుంటే రజినీ ఖాతాలో ‘లాల్ సలామ్’ తరువాత మరో డిజాస్టర్ పడినట్టుగా అన్పిస్తోంది.

హెల్ప్ చేయని వివాదాలు 

‘వేట్టయన్’ మూవీ లో ఉన్న కొన్ని డైలాగ్స్, సీన్స్ ఎన్కౌంటర్ ను సమర్ధించేలా ఉన్నాయంటూ ఓ వర్గం ఫైర్ అయ్యింది. దీంతో ఆ సన్నివేశాలను, డైలాగులను డిలీట్ చేసేదాకా సినిమాను రిలీజ్ చేయకుండా బ్యాన్ చేయాలంటూ మదురై కోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఈ సినిమాను తెలుగులో తెలుగు టైటిల్ తోనే రిలీజ్ చేయాలనేది మరో వివాదం. సాధారణంగా సినిమాలకు వివాదాలు ఫ్రీ ప్రమోషనల్ స్ట్రాటజీగా మారతాయి. కానీ ‘వేట్టయన్’కు ఇది కూడా కలిసిరాలేదు. ఇన్ని వివాదాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు జనాలు ఎలాంటి తీర్పునిస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Vettaiyan Movie Full Review Coming Soon on Bigtvlive.com

Related News

Ram Nagar Bunny Review : ‘రామ్ నగర్ బన్నీ ‘ రివ్యూ… యాటిట్యూడ్ స్టార్ కు హిట్ పడినట్టేనా?

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Dakshina Movie Review : ‘దక్షిణ’ మూవీ రివ్యూ..

Satyam Sundaram Review : ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ… దేవర ముందు నిలబడ్డారా?

Devara Review : దేవర మూవీ రివ్యూ

Devara Twitter Review : దేవర ట్విట్టర్ రివ్యూ… మినిట్ మినిట్ అప్డేట్…

×