EPAPER
Kirrak Couples Episode 1

Satyam Sundaram Review : ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ… దేవర ముందు నిలబడ్డారా?

Satyam Sundaram Review : ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ… దేవర ముందు నిలబడ్డారా?

Satyam Sundaram Review : తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ, ఒకప్పుడు మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఎంతోమంది లేడి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టిన సీనియర్ హీరో అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సత్యం సుందరం’. 96 సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన ప్రేమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాపై బాగానే బజ్ పెంచాయి. ముఖ్యంగా లడ్డుపై కార్తీ చేసిన కామెంట్స్ నేపథ్యంలో చెలరేగిన వివాదం సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. ఈ తమిళ మూవీ కోలీవుడ్లో 27న, తెలుగులో 28న రిలీజ్ అయ్యింది.  మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’తో పాటుగా, పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అనే విషయాన్ని రివ్యూ లో చూసేద్దాం పదండి.


కథ

సత్యం (అరవింద్ స్వామి) గుంటూరులోని తమ సొంత ఇంటిని విడిచిపెట్టి తన కుటుంబంతో సహా వైజాగ్ లో సెటిల్ అవుతారు. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఓ బంధువు పెళ్లి కోసం సత్యం గుంటూరుకు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక సుందరం (కార్తీ) అనే వ్యక్తి తన పట్ల ఓవర్ గా కేరింగ్ చూపించడం సత్యంను ఇబ్బంది పెడుతుంది. అసలు అతను ఎవరు అనే విషయాన్ని సత్యం గుర్తించలేకపోయినా, బంధువులు అందరూ అతనితో బాగానే ఉంటారు. కానీ ఈ సుందరం ఎవరో తెలుసుకోవాలని సత్యం ట్రై చేసినా.. బావ బావ అంటూ జిడ్డులా వెంటపడే సుందరం వల్ల ఆ ప్రయత్నాలు వృథా అవుతాయి. మరి చివరికి సుందరం ఎవరు అన్న విషయాన్ని సత్యం ఎలా తెలుసుకోగలిగాడు? బావ బావ అంటూ జిడ్డులా తగులుకున్న ఆ సుందరం ఎవరు? చివరికి సత్యమూర్తి, సుందరం స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై వీక్షించాల్సిందే.


విశ్లేషణ

డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 96 తరువాత మరో అద్బుతమైన ఎమోషనల్ రోలర్ కోస్టర్ ను ప్రేక్షకులకు అందించారు. కొత్త కథ కాకపోయినప్పటికీ డైరెక్టర్ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే ఎప్పటిలాగే ఆయన సినిమా నెమ్మదిగా సాగినప్పటికీ, మొత్తంగా చూసుకుంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అన్పిస్తుంది. పల్లెటూరు జీవితాన్ని అందంగా చిత్రీకరించి, మరోసారి మానవ సంబంధాల విలువలను తెరపై అద్భుతంగా చూపించారు.

కాకపోతే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కానీ సినిమాను చూస్తున్నంత సేపు ఇదొక తమిళ సినిమా అన్న ధ్యాసే ఉండదు. ఇక కార్తీ, అరవింద్ స్వామి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీ, అరవింద్ స్వామీల పర్ఫామెన్స్ సినిమాకు మేజర్ హైలెట్ అని చెప్పొచ్చు. వాళ్లు నటించిన విధానం చూస్తే తెరపై సినిమాను చూస్తున్నాము అన్న ఫీలింగ్ కాకుండా రియల్ గా చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీని చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకోవడం ఖాయం. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది.

ప్లస్ పాయింట్స్
కథ, కథనం
కార్తీ, అరవింద్ స్వామిల పర్ఫామెన్స్
గోవింద వసంత సంగీతం

మైనస్ పాయింట్స్
సుదీర్ఘమైన డైలాగులు
అక్కడక్కడా సాగదీసిన సన్నివేశాలు
పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం
సినిమా రన్ టైం

మొత్తంగా : హ్యూమన్ రిలేషన్స్ వాల్యూపై తెరకెక్కిన హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్ డ్రామా ‘సత్యం సుందరం’. ల్యాగ్ అనిపించినప్పటికీ తోబుట్టువులు ఉన్నవారు కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. పైగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మస్ట్ వాచ్ ఎమోషనల్ ఎంటర్టైనర్.

రేటింగ్ : 3/5

Related News

Devara Review : దేవర మూవీ రివ్యూ

Devara Twitter Review : దేవర ట్విట్టర్ రివ్యూ… మినిట్ మినిట్ అప్డేట్…

Big Stories

×