EPAPER

Janaka Aithe Ganaka First Review : ‘ జనక అయితే గనక ‘ ఫస్ట్ రివ్యూ… ఎలా ఉందంటే?

Janaka Aithe Ganaka First Review : ‘ జనక అయితే గనక ‘ ఫస్ట్ రివ్యూ… ఎలా ఉందంటే?

Janaka Aithe Ganaka First Review : టాలీవుడ్ లో మట్టిలో మాణిక్యం అని చెప్పుకునే యంగ్ హీరో సుహాస్. అతని సినిమాలు కమర్షియల్ అంశాలకు దూరంగా మంచి కంటెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి అనే పేరు ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్లో ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తున్న హీరో ఆయన మాత్రమే. ఈ ఏడాది మొదట్లోనే ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’,  ‘ప్రసన్న వదనం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ దసరా కానుకగా ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం పదండి.


జనక అయితే గనక ఫస్ట్ రివ్యూ…

సుహాస్ హీరోగా,  సంగీర్తన విపిన్ కథానాయికగా నటిస్తున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జనక అయితే గనక’. అక్టోబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కుమార్తె హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సెప్టెంబర్ 7న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా అక్టోబర్ 12 కు వాయిదా పడింది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విజయవాడ వంటి కొన్నిచోట్ల ప్రీమియర్స్ వేశారు. దీంతో సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.


ఇక సినిమా టాక్ విషయానికి వస్తే… హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్, సుహాస్ ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే కోర్టు సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో చిన్నపాటి మెసేజ్ ఇచ్చి యువతరాన్ని డైరెక్టర్ ఆలోచింపజేశారని అంటున్నారు. కొంత వరకు ల్యాగ్ సన్నివేశాలు ఉన్నా… మధ్య మధ్యలో వచ్చే కామెడీ కవర్ చేసేలా ఉందని తెలుస్తోంది.  మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా దసరాకి ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని అంటున్నారు. అయితే దసరా టైంలో కాకుండా నార్మల్ టైంలో ఈ మూవీ రిలీజ్ చేస్తే మంచి రిజెల్ట్ వచ్చేది. దసరా టైంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా ఈసారి దసరాకు అరడజను సినిమాలకు పైగానే రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ‘జనక అయితే గనక’ రాంగ్ టైంలో వచ్చిన మంచి సినిమా అని చెప్పొచ్చు. మరి దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న సినిమాలను తట్టుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో నిలబడుతుందా? టాక్ పాజిటివ్ గానే ఉన్నా, మంచి కలెక్షన్స్ రాబడుతుందా ? అనేది చూడాలి.

‘జనక అయితే గనక’ స్టోరీ ఏంటంటే?

హీరో ఇందులో వాషింగ్ మిషన్ సేల్స్ మెన్ గా పని చేస్తాడు. అయితే చాలీచాలని జీతం కారణంగా పెళ్లైనప్పటికీ పిల్లల్ని కనొద్దు అని ఫిక్స్ అవుతాడు. కానీ ఊహించని విధంగా సేఫ్టీ వాడినప్పటికీ భార్య ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి హీరో షాక్ అవుతాడు. అయితే దీనంతటికీ కారణం కండోమ్ కంపెనీ అంటూ కోర్టుకు ఎక్కుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెలియాలంటే థియేటర్లలో ఈ సినిమాను చూడాల్సిందే. మూవీ రిలీజ్ కు ఒకరోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Related News

Vettaiyan First Review : ‘వేట్టయన్’ ఫస్ట్ రివ్యూ… రజినీ వివాదాస్పద మూవీ ఎలా ఉందంటే?

Ram Nagar Bunny Review : ‘రామ్ నగర్ బన్నీ ‘ రివ్యూ… యాటిట్యూడ్ స్టార్ కు హిట్ పడినట్టేనా?

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Dakshina Movie Review : ‘దక్షిణ’ మూవీ రివ్యూ..

Satyam Sundaram Review : ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ… దేవర ముందు నిలబడ్డారా?

Devara Review : దేవర మూవీ రివ్యూ

Big Stories

×