EPAPER

Dakshina Movie Review : ‘దక్షిణ’ మూవీ రివ్యూ..

Dakshina Movie Review : ‘దక్షిణ’ మూవీ రివ్యూ..

Dakshina Movie Review: తమిళ నటి.. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్.కానీ ఇటీవల ఆమె నుండి వచ్చిన సినిమాలు అన్నీ నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే.. తెలుగులో ఆమె ‘షికారు’ ‘అంతిమ తీర్పు’ వంటి వరుస సినిమాలు చేసింది. అవి వచ్చి వెళ్లినట్టు చాలా మంది ప్రేక్షకులకి తెలీదు. ఇప్పుడు ‘దక్షిణ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మంత్ర’ ‘మంగళ’ వంటి సినిమాలు తీసిన ‘ఓషో’ తులసీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ అయితే చాలా బోల్డ్ గా ఉంది. రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో సాయి ధన్సిక కనిపించింది. మరి ఈ సినిమా అయినా ఆమెకు సక్సెస్ ను కట్టబెట్టిందో లేదో తెలుసుకుందాం రండి ..


కథ :

నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒంటరిగా దొరికిన అమ్మాయిలను ఓ సైకో కిడ్నాప్ చేసి.. సుత్తితో నెత్తిపై బలంగా కొట్టి.. చంపేస్తాడు. తర్వాత వాళ్ళ శరీరాల నుండి తలలను నరికేస్తూ ఉంటాడు. ఈ కేసుని డీల్ చేయడానికి ఓ లేడీ ఏసీపీ రంగంలోకి దిగుతుంది. ఆమెతో పాటు దక్షిణ(సాయి ధన్సిక) అనే మగరాయుడులాంటి అమ్మాయి కూడా దర్యాప్తు చేపడుతుంది. అయినప్పటికీ అమ్మాయిల మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. అయితే దక్షిణ అనే అమ్మాయి కూడా ఆ సైకో కోసం ఎందుకు వెతుకుతూ తిరుగుతుంది. ఆ సైకో వాళ్ళ దక్షిణ జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటి? అసలు దక్షిణ ఎవరు? చివరికి ఆ సైకో దొరికాడా? అనేది మిగిలిన కథ.


విశ్లేషణ :

క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు మన మైండ్లో రెండు రకాల ప్రశ్నలు మెదులుతాయి. ఒకటి సైకో ఎవరు? రెండోది అతను ఏ ఉద్దేశంతో మర్దర్లు చేస్తున్నాడు.? అని..! ఈ రెండు విషయాల్లోనూ ఆసక్తిని పెంచడంలో దర్శకుడు ఓషో తులసిరామ్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. సైకోని మొదట్లోనే రివీల్ చేయడం.. అతని చేష్టలు అన్ని క్రూరంగా ఏమీ అనిపించవు. కానీ దక్షిణ అనే పాత్ర పోలీస్ అని రివీల్ చేసినప్పుడు. ఆమె ధైర్యసాహసాలుకి సంబంధించి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎలివేషన్ సీన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఆమె పాత్రకి ఎటువంటి హైస్ ఇవ్వలేదు దర్శకుడు. పైగా ఆమె ఇంట్లోకి వచ్చేసి మత్తుమందు ఇచ్చేసి సైకో రేప్ చేయడం అనే పాయింట్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. ఆ ఘోరమైన సంఘటన వల్ల డిప్రెషన్ కి లోనయ్యి మందు సిగరెట్లకు బానిసైపోయినట్టు దక్షిణ పాత్రని చూపించారు. సినిమాకి పెద్ద మైనస్ అదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ దర్శకుడు అనుకున్న పాయింట్…క్లైమాక్స్ కొంతలో కొంత బెటర్. మిగిలినవి అన్నీ ఇరిటేట్ చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఇలా ఏ రకంగా చూసుకున్నా.. ‘దక్షిణ’ నిరాశే మిగిల్చింది అని చెప్పాలి.

నటీనటుల విషయానికి వస్తే.. ఇందులో సాయి ధన్సిక రెండు రకాల లుక్స్ లో కనిపించింది. అయితే ఈమె టాలెంట్ ను దర్శకుడు పూర్తిగా వాడలేదు. కానీ ఈ పాత్రకి ఆమె పర్ఫెక్ట్. ప్రాబ్లమ్ డైరెక్టర్లో ఉన్నప్పుడు ఈమె చేసేదేమీ ఉండదు. స్నేహ సింగ్ పర్వాలేదు అనిపించేలా చేసింది. సైకో పాత్ర చేసిన రిషవ్ బసు పర్వాలేదు. బాగానే చేశాడు. కరుణా భూషణ్, మేఘన చౌదరి.. ఒకటి రెండు సీన్లకి పరిమితమయ్యారు. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

ప్లస్ పాయింట్స్ :

క్లైమాక్స్ (కొంత వరకు)

సాయి ధన్సిక

కొన్ని యాక్షన్ బ్లాక్స్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

స్క్రీన్ ప్లే

ఫస్ట్ హాఫ్

మొత్తంగా.. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తీసినప్పుడు లాజిక్స్ వంటివి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తీసినప్పుడు స్క్రీన్ ప్లేతో పాటు లాజిక్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. అవి మిస్ అయినప్పుడు ఎంత మంచి పాయింట్ తో సినిమా తీసినా అది ప్రేక్షకులకి రుచించదు. ‘దక్షిణ’ విషయంలో అదే జరిగింది. ఓటీటీలో సైతం ట్రై చేసే విధంగా ఈ సినిమా లేదు.

Dakshina Movie Review Rating : 1/5

Related News

HarshaSai: సైబర్ క్రైమ్ లో కంప్లైంట్.. వికృత చేష్టలకు బాధిత యువతి ఎమోషనల్..!

Big Tv Exclusive : RC16 షూటింగ్ కి అంతా సెట్… పూర్తి డీటైల్స్ ఇవే…

Rajinikanth: డిశ్చార్జ్ అయిన రజినీకాంత్.. కానీ..?

Jr. Ntr : ఇక్కడ సినిమాలకు బ్రేక్.. అక్కడ సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Swag Movie Review : ‘శ్వాగ్’ మూవీ రివ్యూ… శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Janvikapoor : ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని చెయ్యను.. జాన్వీ పాప షాకింగ్ డెసిషన్..!

Big Stories

×