C.D.Criminal or Devil Movie Review : టాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ (Adhah Sharma) గ్లామర్ పాత్రను పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పుడు ఈ ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ (C.D.Criminal or Devil Movie) అనే మూవీ తో చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదా శర్మ (Adhah Sharma) హీరోయిన్ గా కృష్ణ అన్నం దర్శకత్వం వహించిన “సిడి క్రిమినల్ ఆర్ డెవిల్” అనే ఈ హర్రర్ మూవీని ఎస్ఎస్సిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ ఏడాది మార్చి 24 న థియేటర్లలోక వచ్చిన ఈ మూవీ 7 నెలల తరువాత ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ…
సిద్దు చాలా బిడియస్తుడు. పైగా దయ్యాలంటే అతనికి విపరీతమైన భయం. అతని తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక అప్పుడప్పుడు పనిమనిషి వచ్చి పనులు చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో సింగిల్ గా ఉన్న సిద్దు దయ్యం సినిమాను చూసి అందులో ఉన్న దయ్యాలు తనను చంపాలనుకున్నట్టుగా భ్రమ పడతాడు. ఇంకోవైపు సిటీలో లేడీ సైకో రక్ష, ‘ఐ విల్ కిల్ యు’ అని రాసి మరీ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఆమెను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుండటంతో రక్ష సిద్దు ఇంటికి వెళుతుంది. అసలు రక్ష ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది? ఆమె సిద్దు ఇంటికి ఎందుకు వెళ్ళింది? సిద్దుకున్న అసలు సమస్య ఏంటి? అమ్మాయిల కిడ్నాప్ వెనక ఉన్న రహస్యమేంటి? ఆనే విషయాలు తెలియాలంటే ‘సిడి’ (C.D.Criminal or Devil Movie) అనే ఈ సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ…
సినిమాలో కేవలం రెండే రెండు పాత్రలు ఉండడం అన్నది ఓ వర్గం ప్రేక్షకులకు పెద్దగా నచ్చక పోవచ్చు. డైరెక్టర్ రొటీన్ ఫార్ములానే తీసుకుని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా మొత్తం ఒకే ఇంట్లో నడుస్తుంది. అందులోనే కామెడీ, థ్రిల్లింగ్, హర్రర్, సస్పెన్స్ వంటి అంశాలను కలగలిపి కథను రాసుకున్నారు డైరెక్టర్. కానీ సినిమా అంతా ఓకే ఇంట్లో సాగడం వల్ల సాగదీసినట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే లాజిక్ లెస్ సీన్స్ ను క్లైమాక్స్ లో మిక్స్ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తే, ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కొన్నిసార్లు ఆసక్తికరంగా, మరికొన్నిసార్లు హర్రర్ ఎలిమెంట్స్ తో సాగుతాయి. మధ్య మధ్యలో రోహిణి పాత్ర చేసే కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్. క్లైమాక్స్ ట్విస్ట్ మెయిన్ హైలెట్. సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్ లో నేపథ్య సంగీతం ఒకటి. అలాగే ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నటీనటుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అదా శర్మ తన యాక్టింగ్ తో భయపెట్టింది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంటుంది. విశ్వంత్ పాత్ర సినిమాకు హైలెట్. పోలీస్ ఆఫీసర్ భరణితో పాటు మిగతా పాత్రలు ఓకే అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్
క్లైమాక్స్
హీరో హీరోయిన్లు
సినిమాటోగ్రఫీ
బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
లాజిక్ లెస్ సీన్స్
క్లైమాక్స్ ట్విస్ట్ కోసమే కథను సాగదీయడం
హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా భయపెట్టలేకపోయాయి
మొత్తానికి
అదా శర్మ, విశ్వంత్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు