Big Stories

Jyeshtha Pouranami :  జేష్ఠ్య పౌర్ణమి రోజు ప్రత్యేకత ఏంటి….

Jyeshtha Pouranami : జేష్ఠ్య మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. రవికి, చంద్రుడుకి మధ్య దూరాన్ని బట్టి తిథులు వస్తుంటాయి. ఒక్కో తిథికి ఒక్కో రకమైన శక్తి ఉద్భవిస్తుంది. అందులో పౌర్ణమి విషయానికి వస్తే ఒక్కో పౌర్ణమికి ఒక్కో ఎనర్జీ వస్తుంది. భూమి సమస్యల పరిష్కారానికి , గండాలు తొలగిపోవడానికి ఈ పౌర్ణమి ప్రత్యేకంగా యోగిస్తుంది. వృశ్చిక రాశి బాగున్న వారికి రియల్ ఎస్టేట్ బిజినెస్ కలిసి వస్తుంది. కుజుడు మూలంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఏమీ లేకుండా భూ విక్రయాలు ప్రారంభించిన వారు ఐశ్వర్యవంతులు అవుతుంటారు. అందరికి కాదు కొంతమందికి మాత్రమే ఇది జరుగుతుంది
.జేష్ఠ్యా నక్షత్రం వృశ్చికరాశితో ఉంటుంది. వృశ్చికరాశిలో చంద్రుడు జేష్ఠ్యా అనురాధ నక్షత్రాల మధ్య పౌర్ణమి రాబోతోంది. పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధన చేయాలి. అమ్మవారు దగ్గరగా ఉండగా తిథుల్లో పౌర్ణమి ఒకటని దేవీభాగవతంలో పౌర్ణమి, అమవాస్య తిథుల్లో పూజల గురించి ప్రస్తావన ఉంటుంది. మానసికగా ఒత్తిడిని ఎదుర్కొనే వారు ఈ రోజు పూజ చేయడం వల్ల సమస్య నుంచి బయటపడతారు. అనుకోని భయాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత చలివిడి ముద్ద, పానకం వంటివి సిద్దం చేసుకుని ఇంటిపైన చంద్రుడ్ని చూస్తూ ప్రార్థన చేయాలి. లలితా సహస్రనామ పఠనం లేదా శ్రవణం చేయడం శుభాన్ని కలిగిస్తుంది. తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి.

- Advertisement -

చంద్రుడ్ని పఠనం చేయడంవల్ల విశ్వశక్తి కలుగుతుంది. షట్చక్రాలు ఉత్తేజితమవ్వడం, నాడులు యాక్టివ్ కావడం దీని వల్ల కలిగే ప్రయోజనం. ఇలాంటి శక్తిని పొందడం వల్ల కర్మక్షయం జరుగుతుంది. గతంలో తెలిసో తెలియకుండా చేసిన దోషాలు నివారించబడతాయి. అందుకే భూ సమస్యలు, మానసిక రుగ్మతలు పౌర్ణమి రోజు చేసే పూజలో పరిష్కారమవుతాయి. కల్లు ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయడం, ఆవు మూత్రంతో ఇంటికి కడగడం లాంటి పౌర్ణమి రోజు చేస్తే ఇంటి వాస్తు, ఆర్ధిక సమస్యలకి పరిష్కార మార్గం కనిపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News