TS EAMCET Results(Telangana Latest News) : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది అర్హత సాధించారు. అన్ని విభాగాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.
ఇంజనీరింగ్ విభాగంలో 79 శాతం బాలురు, 82 శాతం అమ్మాయిలు అర్హత సాధించారు. అగ్రికల్చర్ , ఫార్మా విభాగంలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే ఉన్నారు.
ఎంసెట్ కు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , ఫార్మా స్ట్రీమ్ పరీక్ష నిర్వహించారు. మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించారు.
ఇంజనీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85 శాతం రిజర్వ్ చేశారు. 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
ఇంజనీరింగ్ విభాగంలో టాపర్లు ..
సనపల అనిరుధ్ -(విశాఖపట్నం)
ఎక్కింటిపాని వెంకట మణిందర్ రెడ్డి- (గుంటూరు)
చల్లా ఉమేశ్ వరుణ్- (నందిగామ)
అభినీత్ మాజేటి- (కొండాపూర్)
పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి -(తాడిపత్రి)
అగ్రికల్చర్ , ఫార్మా విభాగంలో టాపర్లు..
బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ (తూర్పుగోదావరి జిల్లా)
నశిక వెంకటతేజ (చీరాల)
సఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్‌నగర్)
దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
ఇంజనీరింగ్ విభాగం..
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు – 1,53,890
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు – 51,461
పరీక్షకు హాజరైన విద్యార్థులు – 1,95,275
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు – 1,57,879
ఉత్తీర్ణత శాతం – 80%
బాలురు ఉత్తీర్ణత శాతం – 79%
బాలికల ఉత్తీర్ణత శాతం – 82%
ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో..
పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు – 94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు – 20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు – 1,01,544
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు – 91,935
ఉత్తీర్ణత శాతం – 86%
బాలుర ఉత్తీర్ణత శాతం – 84%
బాలికల ఉత్తీర్ణత శాతం – 87%
Leave a Comment