EPAPER

Rahul Gandhi : ఖమ్మం జన గర్జన సభ.. రాహుల్ స్పీచ్.. ప్రస్తావించే అంశాలివే..!

Rahul Gandhi : ఖమ్మం జన గర్జన సభ.. రాహుల్ స్పీచ్.. ప్రస్తావించే అంశాలివే..!

Rahul Gandhi : ఖమ్మం జన గర్జన సభలో రాహుల్‌ గాంధీ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా 10 అంశాలు ప్రస్తావిస్తారని సమాచారం. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించే అవకాశం ఉంది. రైతుల ఆత్మహత్యలు, ధాన్యం కొనుగోళ్ల అంశాలను ప్రస్తావించనున్నారు.


తెలంగాణ అమరవీరులకు జరిగిన అన్యాయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల ప్రారంభమైన అమరజ్యోతి స్థూపంపై అమరుల పేర్లు లేకపోవడాన్ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. తాము అధికారంలోకి వస్తే అమరులను స్మరించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపైనా రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని రాహుల్ ఎండగట్టే అవకాశం ఉంది. ఇటీవల కాగ్‌ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి రెట్టింపు ఖర్చు అవుతోందని కాగ్ స్పష్టం చేసింది. ఇప్పటికే లక్ష కోట్ల ప్రభుత్వం ఖర్చు పెట్టగా.. మరో 50 వేల కోట్లు ఖర్చు చేస్తేనే కాళేశ్వరం పూర్తవుతుందని వెల్లడించింది. ఇప్పటి వరకు తీసుకున్న అప్పులు ఖజానాకు గుదిబండగా మారనున్నాయని కాగ్ ఆందోళన వెలుబుచ్చింది. నెలకు రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీలు, ఇతర ఖర్చులకే కావాలని తెలిపింది.


ఏడాదికి దాదాపు 10 వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి రావడం ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాగ్. తీసుకున్న అప్పులను కూడా ఇతర ఖర్చులకు దారి మళ్లించారని పేర్కొంది. ఎకరా సాగు వ్యయం కూడా అంచనాలు మించిపోయిందని.. ఒక్క ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు చేయడమంటే ఏమాత్రం ఆశాజనకమైన ఫలితాలు రావని కాగ్‌ అభిప్రాయపడింది. కాళేశ్వరం సహా మిగతా ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలన్నీ రాహుల్ ప్రసంగంలో వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్.. కవిత ప్రమేయంపై రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మద్యం కుంభకోణంపై ఈడీ కవితను పలుమార్లు విచారించింది. చార్జ్‌షీట్‌లోనూ పేరు ప్రస్తావించింది. అయితే ఆమెను ఎందుకు అరెస్ట్‌ చేయలేదనే చర్చ జరిగింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై అసహనంగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి బీటీమ్‌ అనే అనుమానాలు ఈ వ్యవహారం వల్ల బయటపడినట్లైందని కొందరు బీజేపీ నేతలు బాహాటంగానే మాట్లాడారు. ఈ అంశాన్ని కూడా రాహుల్ ఎండగట్టే ఛాన్స్‌ కనిపిస్తోంది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోపిడి చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లీజ్‌ అంశం సహా.. ల్యాండ్‌ స్కామ్‌లు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ ఈ అంశాలపైనా మాట్లాడొచ్చు.

ఖమ్మం సభపై ఆంక్షలు విధించడంపైనా రాహుల్ గట్టిగానే బదులిచ్చే అవకాశం కనిపిస్తోంది. వారం రోజుల్లో ప్రధాని వరంగల్‌కు రానున్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేటి.. కాంగ్రెస్‌ విభజన హామీలను మోదీ పక్కనపెట్టిన అంశాలను ఎండగట్టే అవకాశం ఉంది. బీజేపీ మతతత్వ రాజకీయాలు, యూనిఫార్మ్ సివిల్ కోడ్ అంశాలకు గట్టిగానే బదులివ్వనున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని మరోసారి స్పష్టత ఇవ్వనున్న రాహుల్.. కర్ణాటక తరహాలో తెలంగాణలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేయనున్నారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×