BigTV English

M.S Dhoni’s New Record :ఇలాంటి రికార్డ్స్.. ధోని ఒక్కడికే సొంతం..

M.S Dhoni’s New Record  :ఇలాంటి రికార్డ్స్.. ధోని ఒక్కడికే సొంతం..
M.S Dhoni's  New Record

M.S Dhoni’s New Record : మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్. ఒక ఫ్రాంచైజీకి ఎక్కువ సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా ధోని పేరు రికార్డుకెక్కింది. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న గేమ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు 200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు ధోని. నిజానికి మొత్తం ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌లకు ధోని కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే.. మధ్యలో సీఎస్కేపై బ్యాన్ విధించడంతో పుణె సూపర్ జెయింట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయినా సరే.. ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ధోని రికార్డ్ కొట్టేశాడు.


ధోని కెప్టెన్సీలో సీఎస్కే నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. ముంబై ఇండియన్స్ తరువాత ఎక్కువ టైటిల్స్ గెలిచింది చైన్నై సూపర్ కింగ్సే. ధోని సారధ్యంలోనే 9 సార్లు ఫైనల్‌కు వెళ్లిందీ సీఎస్కే జట్టు. అంతేకాదు ధోని కెప్టెన్‌గా 199 మ్యాచ్‌లు ఆడితే.. అందులో 120 మ్యాచ్‌లు గెలిచింది. అంటే, విన్నింగ్ పర్సంటేజ్ 60.61. ఇది ఇంక్రెడిబుల్ రికార్డ్.

కెప్టెన్‌గా 4వేల పరుగులు పూర్తి చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. 22 హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో ఎంత ప్రెషర్‌లో ఉన్నా బౌండరీస్ బాదడంలో ధోనికి సాటి లేరు. మ్యాచ్ ఫినిషర్‌గా ఇప్పటికీ ధోనీదే రికార్డ్. ఇక వికెట్ కీపర్‌గా స్టంప్ ఔట్స్ విషయంలోనూ ధోనీదే రికార్డ్.


Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×