Big Stories

LSG vs GT IPL 2023 : చిన్న టార్గెట్ కొట్టలేకపోయిన లక్నో.. గుజరాత్‌కు మరో విజయం

LSG vs GT IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ చేజేతులా మ్యాచ్ ఓడిపోయింది. లక్నో వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓడింది. గుజరాత్ ఇచ్చిన 136 పరుగుల స్వల్ప టార్గెట్‌ను చేధించలేక చతికిలపడింది. ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్.. మాత్రమే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ ఫర్వాలేదనిపించాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో 19 బాల్స్ లో 24 రన్స్ చేశాడు. కృనాల్ పాండ్యా బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించాడు. 23 బాల్స్ కు 23 పరుగులు చేశాడు. అయితే, ఓ దశలో గెలుస్తున్నట్టే కనిపించిన లక్నో… ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లకు 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, మోహిత్ శర్మ 2 వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

- Advertisement -

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గుజరాత్ 135 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ లో హార్దిక్ పాండ్యా,  వృద్దిమాన్ సాహా రాణించారు. వృద్దిమాన్ సాహా 37 బంతుల్లో 47 పరుగులు, హార్దిక్ 50 బంతుల్లో 66 పరుగులు చేశారు.

- Advertisement -

ముఖ్యంగా లక్నో బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. శుభ్ మన్ గిల్ ఖాతా డకౌట్ అయ్యాడు. అభినవ్ ముకుంద్ సైతం 3 పరుగులకే వెనుదిరిగాడు. విజయ్ శంకర్ జస్ట్ పది పరుగులు, మిల్లర్ 6 రన్స్, రాహుల్ తివాటియా 2 పరుగులు మాత్రమే చేశారు.

లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. స్టోయినిస్ కు రెండు వికెట్లు దక్కాయి. నవీన్ అల్ హక్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News