Big Stories

Kishan Reddy: తెలంగాణ పరువుతీశారు.. ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందా?: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. సంచలనం రేపుతోంది ఈ వార్త. అయితే లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మహిళా రిజర్వేషన్ అంటూ కవిత కొత్త నాటకానికి తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో కవిత తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారన్నారు.

- Advertisement -

లిక్కర్ వ్యాపారం చేసి అక్రమంగా డబ్బు సంపాదించి తెలంగాణ రాష్ట్ర పరువును ఢిల్లీలో తీశారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఒక మహిళ ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చిందని అన్నారు.

- Advertisement -

ఈడీ నోటీసులు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. సానుభూతి కోసం కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఒక మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు పాలన చేసిన పార్టీ మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని అన్నారు. సీఎం కూతురుకు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం ఉండదన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News