BigTV English

ICC Rankings:ఐసీసీ ర్యాంకుల్లో జడేజా, అశ్విన్ అదుర్స్

ICC Rankings:ఐసీసీ ర్యాంకుల్లో జడేజా, అశ్విన్ అదుర్స్

ICC Rankings:బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్… ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా నెంబర్ వన్‌గా నిలవగా, అశ్విన్ రెండో స్థానానికి ఎగబాకాడు. 460 పాయింట్లతో జడేజా, 376 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాల్లో ఉండగా… 283 పాయింట్లతో అక్షర్ పటేల్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. జడేజా విజృంభణతో… ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చాలా మంది ఆల్‌రౌండర్ల స్థానాలు గల్లంతయ్యాయి.


ఇక టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ దూసుకొచ్చాడు. ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బౌలర్లలో నాలుగేళ్ల నుంచి తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్… పేలవ ప్రదర్శనతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 866 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉండగా… అశ్విన్ 864 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాట్ కమిన్స్ 858 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే మిగతా రెండు టెస్టుల్లోనూ అశ్విన్ రాణిస్తే… ఈజీగా టాప్ ప్లేస్ అతని సొంతమవుతుంది. ఇక టెస్ట్ బౌలర్లలో బుమ్రా 795 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని… 763 పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకాడు. జడేజా 2019 తర్వాత టాప్-10 లోకి రావడం ఇదే తొలిసారి.

ఇక టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. టాప్-10లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ 781 పాయింట్లతో ఆరో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ 777 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నారు.


Cricketers Jersey:భారత క్రికెటర్ల జెర్సీపై కొత్త బ్రాండ్

Women’s T20 World Cup: సెమీస్ లో భారత్- ఆస్ట్రేలియా ఢీ.. గెలుపెవరిది..?

Related News

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Big Stories

×