Sowmya Rao: జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ వెళ్లిపోయాకా.. ఆ ప్లేస్ లో ఎవరు వస్తారా అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో మరో హాట్ బ్యూటీ సౌమ్యరావ్ ఎంట్రీ ఇచ్చింది.
అనసూయలాంటి అందంతో.. వచ్చీరానీ తెలుగుతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక చిట్టిపొట్టి డ్రెస్ లలో కూడా కనిపించి ఔరా అనిపించింది సౌమ్య రావ్.
జబర్దస్త్ లో అనసూయ లేని లోటును సౌమ్య తీరుస్తుంది అనుకొనేలోపు.. షో మానేసి వెళ్ళిపోయింది. జబర్దస్త్ మానేయడానికి తన కారణాలు తనకు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ఆ కామెడీ షోకు యాంకర్ గా చేసింది కొన్ని వారాలే అయినా అమ్మడిని తెలుగు ప్రేక్షకులు మంచిగానే ఆదరించారు. ప్రస్తుతం బుల్లితెర షోస్ లలో ఆమె కనిపిస్తుంది.
కన్నడలో సీరియల్స్ తో మెప్పించిన సౌమ్య ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ప్రస్తుతం ఒకపక్క సీరియల్స్, షోస్ తో బిజీగా మారింది.
ఇక సౌమ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా సౌమ్య వైట్ కలర్ డిజైనర్ లెహంగాలో అందాల విందు చేసింది. నడుము అందాలను ఎరగా వేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
ఇక సడెన్ గా సౌమ్య ఫోటోలు చూసిన వారెవరైనా.. ఎవరీ దేవకన్య.. దివి నుంచి భువికి దిగివచ్చిందా.. ? అని అనేక మానరు. అంత అందంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం సౌమ్య రావ్ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ చిన్నది త్వరలో తెలుగు సినిమాల్లో ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి.