Katrina Kaif Birthday Special: టాలెంట్ ఉండక్కర్లేదా అన్నారు కొందరు.. నటన రాదు.. డాన్స్ రాదు.. వేస్ట్ అంటూ తీసిపారేసారు మరికొందరు. ఆమె బాధపడింది. నిరాశలో కూరుకుపోయి వెనకడుగు వేయలేదు. తానేంటో చూపించాలనుకుంది.
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకి బెస్ట్ పెయిర్ అయింది. బడా దర్శక నిర్మాతలకు పోస్ట్ ఛాయిస్ అయింది. ఆమె ఎవరోకాదు కత్రినా కైఫ్.. ఈరోజు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
తండ్రిది కష్మీర్, తల్లిది బ్రిటన్.. ఆమె పుట్టింది హాంకాంగ్ లో.. 16 జూలై 1983న జన్మించింది. ఏడుగురు సంతానంలో ముగ్గురు అక్కలు ముగ్గురు చెల్లెల్లు..
14 ఏళ్ల వయసులో హవాయిలోని బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచింది. ఆ జోష్ లో ఫ్రీలాన్సర్ ఏజెన్సీల తరుపున మోడల్ గా పని చేయడం స్టార్ట్ చేసింది. లండన్ ఫాషన్ వీక్ లో రెగ్యులర్ గా కనిపించేది కత్రినా..
ఒకసారి ట్రిప్ మీద ఇండియాకి వచ్చింది అప్పుడు అనుకోకుండా కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో “బుమ్” మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది.
అమితాబ్ బచ్చన్, జాకీస్ రాఫ్, గుల్సన్ గ్రోవర్, మధు సప్రై, పద్మాలక్ష్మి లాంటి ఫేమస్ పర్శనాలటీస్ నటించిన ఆ మూవీలో ఒక గ్లామరస్ క్యారెక్టర్ చేసింది కత్రినా..
ఆ తర్వాత “మళ్లీశ్వరీ” మూవీలో వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుంకుంది. ఆ సినిమాలో కత్రినాని ఓ ప్రిన్సెస్ లా చూపించాడు దర్శకుడు విజయ్ భాస్కర్.. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో సర్కార్, మైనే ప్యార్ క్యూ కియా, చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.
బాలయ్యతో “అల్లరి ప్రియుడు” తర్వాత ఇక తెలుగు సినిమాల్లో నటించే తీరక లేనంతగా హిందీలో బిజీ అయిపోయిందీ ఈ ముద్దుగుమ్మ.
వరుస పెట్టి అవకాశాలు ఎలా వచ్చాయో అవమానాలు అలాగే వచ్చాయి కత్రినాకి. పిండి బొమ్మలా ఉందని ఆ ముఖంలో హావభావాలే పలకవని చిన్న చిన్న స్టెప్స్ కూడా వేయడం రాదని కామెంట్స్ వచ్చాయి.
దీంతో నటనపై మరింత దృష్టి పెట్టింది. పట్టు వదలకుండా డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఆ తర్వాత అగ్నిపథ్ లో “చిక్నీ చమేలి చుప్కే అకేలి “అంటూ ఆమె చేసిన స్టెప్స్ చూసాకా అందరి మతులు పోయాయి.
బాంబె టాకీస్ లో షీలాకీ జవానీ పాటతో మరోసారి దుమ్ము రేపింది. ఏక్ థా టైగర్, ధూమ్ 3, బ్యాంగ్ బ్యాంగ్, టైగర్ జిందా హై , సూర్యవంశీ, టైగర్ 3, మా భరత్, బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. జీరో, వంటి వరుస సినిమాలు చేసింది.
వీటిలో కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ అవి కత్రినా స్పీడుకి మాత్రం బ్రేకులు వేయలేకపోయాయి.
ఇక సల్మాన్ తో ప్రేమాయణం, రణబీర్ తో రాసలీలు అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. కత్రినా కైఫ్ మాత్రం తనకంటే వయసులో ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుంది.
గత కొన్ని రోజులుగా కత్రినా ప్రెగ్రెన్సీ గురించి రూమర్లు వస్తున్న సంగతీ తెలిసిందే.. అయతే దీనిగురించి విక్కీ స్పందిచారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని ఏదైనా ఉంటే సంతోషంగా ప్రకటిస్తామని తేల్చి చెప్పాడు.
నెగిటివ్ కామెంట్స్ కి బయపడితే ఎప్పటికి ముందుకు పోలేమని పట్టుదలతో ప్రయత్నిస్తే సక్సెస్ సాధించకుండా ఎవరు ఆపలేరని నిరూపించిన కత్రినా ఇకపై ఇలాగే ముందుగు సాగిపోవాలని కోరుకుంటూ ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.