Hebah Patel Latest Photos: ఒక్క సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు ఎంతోమంది ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే క్రేజ్ సంపాదించుకోవడం కంటే అది కాపాడుకోవడం ముఖ్యం. అలా కాపాడుకోలేక వెనకబడిన వారిలో హెబ్బా పటేల్ కూడా ఒకరు. (Image Source: Hebah Patel/Instagram)
‘అలా ఎలా’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టిన తర్వాత రెండో మూవీ అయిన ‘కుమారి 21 ఎఫ్’తోనే ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. (Image Source: Hebah Patel/Instagram)
సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన ‘కుమారి 21 ఎఫ్’ చూసిన తర్వాత చాలామంది యూత్ మనసుల్లో కుమారిగా నిలిచిపోయింది హెబ్బా పటేల్. (Image Source: Hebah Patel/Instagram)
‘కుమారి 21 ఎఫ్’ తర్వాత కూడా హెబ్బా పటేల్‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో ఒక్కటి కూడా మళ్లీ తనకు ఆ రేంజ్‌లో హిట్ ఇవ్వలేకపోయింది. (Image Source: Hebah Patel/Instagram)
ఒక బోల్డ్ పాత్రతో తనకు గుర్తింపు వచ్చింది కాబట్టి వరుసగా బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా వెనకాడలేదు హెబ్బా. కానీ ఆఫర్లు వచ్చినా సక్సెస్ మాత్రం రాలేదు. (Image Source: Hebah Patel/Instagram)
హీరోయిన్‌గా ఆఫర్లు రాకపోవడంతో స్పెషల్ సాంగ్, గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి కూడా వెనకాడలేదు హెబ్బా పటేల్. అదే సమయంలో తను ఓటీటీ సైడ్ కూడా షిఫ్ట్ అయ్యింది. (Image Source: Hebah Patel/Instagram)
హెబ్బా పటేల్ చివరిగా ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం తన చేతిలో ‘ఓదెల 2’తో పాటు పలు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. (Image Source: Hebah Patel/Instagram)
దీపావళి సందర్భంగా రెడ్ లెహెంగాలో ఫోటోలు షేర్ చేసింది హెబ్బా పటేల్. ఇందులో తను అందంగా మెరిసిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Hebah Patel/Instagram)