తాజాగా దిశా పటానీ.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయింది. ఈ పెళ్లిలో శారీలుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఈ బ్యూటీ ప్రంపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్కి 2898 ఏడీ సినిమాలో నటించింది. దాదాపు ఈ సినిమా రూ.1000 కోట్లు క్రాస్ చేసేసింది. ఈ సినిమాలో రూక్సీ క్యారెక్టర్ చేసింది. ఆ పాత్రకు వచ్చిన స్పందన చూసి దిశా పటానీ ఆనందం వ్యక్తం చేసింది.
దిశా పటానీ వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత ఎమ్ఎస్ ధోని బయోపిక్ సినిమాలో నటించింది.
ఇక ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు రాకపోయిన బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
ప్రస్తుతం దిశా పటాని సూర్య “కంగువా” సినిమాతో పాటు బాలీవుడ్ లో అక్షయ్ తో జోడీగా నటిస్తోంది.