EPAPER

Bigg Boss 8: హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్.. ఎవర్రా మీరంతా అనుకుంటే.. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Bigg Boss 8: హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్.. ఎవర్రా మీరంతా అనుకుంటే.. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఈసారి అన్ని సీజన్స్ లా కాకుండా.. ఒక ఆడ, మగా జంటను జోడిగా హౌస్ లోపలి పంపారు. ఇక అవ్వన్నీ పక్కన పెడితే.. ఈ 14 మంది కంటెస్టెంట్స్ అసలు ఎవరు.. వీరి బ్యాక్ గ్రౌండ్స్ ఏంటి అనేది అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మరి వారు ఎవరు అనేది చూద్దాం రండి.


బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది యష్మీ గౌడ. బుల్లితెర ప్రేక్షకులకు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన  అవసరం లేదు. యష్మీ. ఒక కన్నడ నటి. కర్ణాటకలో పుట్టిపెరిగిన ఈ చిన్నది.. కన్నడలో పలు సీరియల్స్ లో నటించి.. నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి, స్వాతి చినుకులు లాంటి సీరియల్స్ తో తెలుగుకు పరిచయమైంది. కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇక జీ తెలుగులో ప్రసారమయిన సూపర్ క్వీన్స్ షోలో కూడా ఈ చిన్నది పాల్గొంది.


బిగ్ బాస్ హౌస్ లోకి రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు నిఖిల్. ఇతడు కూడా కన్నడ నటుడే. అక్కడ పలు సీరియల్స్, షోస్ లతో మెప్పించిన నిఖిల్.. తెలుగులో గోరింటాకు అనే సీరియల్ తో అడుగుపెట్టాడు. ఇక ఆ సీరియల్ హీరోయిన్ కావ్యతో నిఖిల్ ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కావ్య చిన్ని అనే సీరియల్ చేస్తోంది. ఇక నిఖిల్.. అమ్మకు తెలియని కోయిలమ్మ, స్రవంతి.. లాంటి పలు సీరియల్స్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సీరియల్స్ తో పాటు ఇక్కడి టీవీ షోలలో కూడా పాల్గొని పాపులర్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు.

పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటుడు విష్ణు. విజయ్ దేవరకొండ, ప్రియదర్శి పక్కన ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. అందులో నేమ్ తోనే ఫేమస్ అయ్యాడు. అతని అసలు పేరు అభయ్ నవీన్. సిద్ధిపేటకు చెందిన ఈ కుర్రాడు డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నాడు.  స్టార్ హీరో సినిమాల్లో నటించిన అభయ్.. మూడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు.ఇటీవల హీరోగా తనే దర్శకుడిగా రామన్న యూత్ అనే సినిమా తెరకెక్కించాడు. డైరెక్టర్ అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాడట అభయ్. దానికోసమే బిగ్ బాస్ కు వచ్చాడు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో బుల్లితెరపై కు పరిచయమైన మరో కన్నడ బ్యూటీ ప్రేరణ. అక్కడ పలు షోస్, సీరియల్స్ లో నటించిన ప్రేరణ.. తెలుగులో చేసినఒకే ఒక్క సీరియల్ కృష్ణ ముకుంద మురారి. కృష్ణ పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆమె అమాయకత్వం, నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సీరియల్ అయిపోయినా కూడా షోస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వచ్చింది ప్రేరణ. 8 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు బిగ్ బాస్ హూసు లోకి నాలుగోవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది.

లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి, మా అన్నయ్య బంగారం.. ఇలా అనేక సినిమాలలో హీరోగా మెప్పించాడు ఆదిత్య ఓమ్. మధ్యలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆదిత్యను ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోయారు. ఇక ఇన్నాళ్లకు ఆదిత్య బిగ్ బాస్ హౌస్ లో దర్శనమిచ్చాడు. భద్రాద్రిగూడెంలోని కొన్ని పల్లెలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తున్నాడు.

సోనియా ఆకుల.. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్స్ లో ఆమె ఒకరు. దిశ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక ఈ సినిమా తరువాత జార్జ్ రెడ్డి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. జార్జ్ రెడ్డి సినిమాతో ఆమె మంచి గుర్తింపును తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆరో కంటెస్టెంట్ గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది.

 

బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి.. స్టాండప్ కమెడియన్, సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేనా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా మరింత పేరును తెచ్చుకుంది. బెజవాడ బేబక్క అనే పేరుతో కామెడీ రీల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక విజయవాడ భాషలో అమెరికాలో ఉన్న పరిస్థితులను కామెడీగా చెప్పుకొచ్చిన బేబక్క బిగ్ బాస్ లో ఎలాంటి కామెడీ చేయబోతుందో చూడాలి.

బిగ్ బాస్ హౌస్ లోకి 8 వ కంటెస్టెంట్ గా ఆర్జే శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటి జనరేషన్ కు ఈమధ్య బాగా ఫేమస్ అయినా ఫేస్ అంటే శేఖర్ దే అని చెప్పాలి. హీరో రాజ్ తరుణ్ – లావణ్య వివాదంలో శేఖర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజ్ తరుణ్ ను లావణ్య మోసం చేసిందని, ఇల్లు కోసం రాజ్ తరుణ్ ను కావాలనే బ్లేమ్ చేస్తున్నదని మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ శేఖర్ భాషా ఫేమస్ అయ్యాడు. ఇక ఇప్పుడు  ఆ గుర్తింపును వాడుకొని ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ సినిమా ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. బేబీ సినిమాలో.. వైష్ణవిని చెడగొట్టే సీత పాత్రలో నటించి మెప్పించింది. ఎన్నో సినిమాలు చేసినా.. ఆమెకు బేబీ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే.. ఈ సినిమా ద్వారా ఆమె బాగా ట్రోల్ అయ్యింది కూడా. బయట ఎంతోమంది ఆమె క్యారెక్టర్ అలాగే ఉంటుందని నెగెటివ్  కామెంట్స్ చేశారు. అయినా కూడా ఆమె తట్టుకొని నిలబడింది. ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపుతో ఆమె బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లోకి 10 వ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న మణికంఠ కస్తూరి సీరియల్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ హౌస్ లో అతడి కథ విన్నవారందరు అతడికి కనెక్ట్ అయ్యారు. తల్లి చనిపోవడం, చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం.. పాపా పుట్టడం, భార్య వేధించడం ఇలా మొత్తం చెప్పుకొచ్చాడు. తనను తాను నిరూపించుకోవడానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

నాగపంచమి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన పృథ్వీ రాజ్.. 11 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. కన్నడ నటుడు అయిన ఈ కుర్ర హీరో.. మొదటి సీరియల్ తోనే ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇక నీతోనే డ్యాన్స్ షో తో డ్యాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ కన్నడ హీరో బిగ్ బాస్  హౌస్ లో తనను తాను ఎలా నిరుపించుకుంటాడో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 8 కు హైలైట్ అంటే విష్ణు ప్రియనే అని చెప్పాలి. పన్నెండో కంటెస్టెంట్ గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా అనే షోతో విష్ణు ప్రియ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ షో తరువాత ఈటీవీ లో వచ్చే ప్రతి ఈవెంట్ కు విష్ణు ప్రియ వస్తూనే ఉండేది. అలా ఫేమస్ అయ్యింది. ఇక సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హూస్ లో కూడా ఈ చిన్నదాని అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్.

బిగ్ బాస్ సీజన్ 8 లో 13 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నైనికా. ఢీ షో తో ఆమె తెలుగువారికి పరిచయం. ఢీ షోలో డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఆ తర్వాత పలు టీవీ షో లలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాపులర్ అయింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా అమ్మడు బాగానే ఫేమస్ అయ్యింది. మరి ఈ షోలో  ఎలాంటి గ్లామర్ చూపిస్తుందో చూడాలి.

ఇక బిగ్ బాస్ హౌస్ 1లోని 4 వ కంటెస్టెంట్.. చివరి కంటెస్టెంట్  నబిల్ ఆఫ్రిది. చాలామందికి ఇతని గురించి తెలియకపోవచ్చు. వరంగల్ డైరీస్ పేరుతో నబీల్ కు ఒక యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. చివరి నిమిషంలో వేరొకరి ప్లేస్ లో నబీల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ యూట్యూబర్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతవరకు ఫేమస్ అవుతాడో చూడాలి.

 

ఇక చివరగా చెప్పాలంటే.. ఈ 14 మంది చాలామందికి తెలియని కూడా తెలియదు. అందుకే వీరిని చూసి నెటిజన్స్ అస్సలు యెవర్రా మీరంతా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

 

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×