Anasuya Bharadwaj: దీపావళి పండుగ సందర్భంగా.. అనసూయ అరచేతితో దీపాలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
సాక్షీ టీవీలో వార్తా వ్యాఖ్యాతగా కెరియర్‌ను ప్రారంభించిన అనసూయ ఎన్నో సినీ వేడుకల్లో యాంకర్‌గా పని చేసింది.
అనసూయ జీవితాన్ని మలుపుతిప్పింది మాత్రం జబర్ధస్త్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. ఈ షోకి యాంకర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది.
ఈ క్రేజ్ అనసూయను ఎక్కడి వరకు తీసుకెళ్లిందంటే.. టాలీవుడ్ స్టార్ హారోల , సినిమాలో ముఖ్య పాత్రలో అలాగే ఐటెం సాంగ్‌లు చేసేంత వరకు అని చెప్పుకోవచ్చు.
ఎన్టీఆర్ నాగ సినిమాలో న్యాయ విద్యార్థి పాత్రతో సినిమాల్లో అడుగు పెట్టిన అనసూయకు ఆశించిన విజయం దక్కలేదనే చెప్పొచ్చు.
ఆ తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బుజ్జి అనే పాత్ర అనసూయాకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ క్షణంలో ఏసీపీ జయ పాత్ర అనసూయ కెరియర్‌కి సరికొత్త బ్రేక్‌ని ఇచ్చింది.
దీని తర్వాత సాయిధరమ్ తేజ్ మూవీ విన్నర్‌లో ఐటెం సాంగ్‌లో అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈ భామ.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగ స్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించి ప్రేక్షకాధారణ పొందింది.
ఆ తర్వాత పుష్ప, ఖిలాడీ, మైఖేల్, రంగమార్తాండ, విమానం, రజాకార్, సింబా వంటి తదితర సినిమాల్లో అలరించింది.
ప్రస్తుతం పలు సినిమాల్లో నిటిస్తోనే పలు షోలకు యాంకర్‌గా, జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఓ వైపు సినీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా దీపావళి పండుగ సందర్భంగా చేతిలో దీపాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. So lit for this season of Lights Love and Laughter!!
Let the light of Diwali guide our way to Happiness and Prosperity !! ✨💫❤️🎆🪔 అంటూ కాప్షన్ ఇచ్చి ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.