EPAPER

OTT: హోటల్‌లో అమ్మాయి – పిల్లాడిని ముక్కలు చేసి.. ఈ సీరిస్ చూశాక, గెస్టులు ఘోస్టుల్లా కనిపిస్తారు

OTT: హోటల్‌లో అమ్మాయి – పిల్లాడిని ముక్కలు చేసి.. ఈ సీరిస్ చూశాక, గెస్టులు ఘోస్టుల్లా కనిపిస్తారు

OTT: కొరియన్‌ భాషలో సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా వారు తెరకెక్కించే థ్రిల్లర్ జోనర్‌లోని సినిమాలు, సిరీస్ ఎంతోమంది ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అలా తాజాగా ఒక సౌత్ కొరియన్ వెబ్ సిరీస్.. ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సిరీస్ చూసినవారంతా చాలావరకు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరే ‘ది ఫ్రాగ్’ (The Frog). ఇదొక లిమిటెడ్ సిరీస్.. అంటే ఈ సిరీస్‌కు మరొక సీజన్ ఏమీ లేదు. ఒక్క సీజన్‌లోనే కథను మొత్తం పూర్తిచేసేశాడు దర్శకుడు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ‘ది ఫ్రాగ్’.. లిమిటెడ్ సిరీస్ కావడం వల్ల చాలామంది ప్రేక్షకులు దీనిని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


కథ

‘ది ఫ్రాగ్’ కథ విషయానికొస్తే.. యోంగ్ హా (కిమ్ యూన్ సియోక్).. ఊరికి దూరంగా ఒక ఇంట్లో జీవనం కొనసాగిస్తుంటాడు. అలా ఊరికి దూరంగా, నేచర్ మధ్యలో ఉండాలి అన్నది తన భార్య చివరి కోరిక. ఆ ఇంటికి షిఫ్ట్ అయిన కొన్నాళ్లకే తన భార్య అనారోగ్య సమస్యతో చనిపోతుంది. దీంతో తన ఇంటి పక్కనే ఉన్న విల్లాను హాలిడే హోమ్‌గా మార్చి అక్కడే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆ హాలిడే హోమ్‌కు తన కొడుకు సి హ్యోన్‌తో పాటు గెస్ట్‌గా వస్తుంది సియోంగ్ ఆ (గో మిన్సీ). తనను చూడగానే యోంగ్‌కు డౌట్ వస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా తనకు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. తరువాతి రోజు త్వరగా లేచి బయటికి వెళ్లిపోతుంది సియోంగ్. తన రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా తనతో పాటు వచ్చిన కొడుకును ముక్కలుముక్కలుగా నరికేసి ఉంటుంది. అది చూసి యోంగ్‌‌కు నోట మాటరాదు.


కట్ చేస్తే.. కథ 20 ఏళ్ల క్రితానికి వెళ్తుంది. గూ సాంగ్ జున్ (యూన్ కై సాంగ్).. తన భార్యతో కలిసి లేక్ వ్యూ మోటల్‌ను నడుపుతూ ఉంటాడు. ఒకరోజు హ్యాంగ్ కియోల్ అనే వ్యక్తిని తన మోటల్‌లో ఉండడానికి ఆహ్వానిస్తాడు సాంగ్ జున్. కానీ అతడొక సీరియల్ కిల్లర్ అనే విషయం సాంగ్ జున్‌కు తెలియదు. అలా తెలియక చేసిన తప్పు వల్ల తన మోటల్ పరువు దెబ్బతింటుంది. ఆ సీరియల్ కిల్లర్.. అదే మోటల్‌లో ఒక వ్యక్తిని హత్య చేసి పారిపోతాడు. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అయితే 20 ఏళ్ల తర్వాత హాలిడే హోమ్‌లో జరిగిన హత్యకు, ఇప్పుడు ఈ మోటల్‌లో జరిగిన హత్యకు ఒక సంబంధం ఉంటుంది. అదేంటో తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

సరిపడా ట్విస్టులు

‘ది ఫ్రాగ్’.. ఒక సీరియల్ కిల్లర్ క్రైమ్ థ్రిల్లర్. దీని కథ, క్యారెక్టర్స్ విషయంలో దర్శకుడు మో వాన్ ఇల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని సిరీస్ చూస్తుంటే అర్థమవుతుంది. కానీ అక్కడక్కడా సిరీస్ ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ మాత్రం ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంటుంది. ‘ది ఫ్రాగ్’ అనేది 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్. ముందుగా మొదటి నాలుగు ఎపిసోడ్స్‌లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్‌తోనే సరిపోతుంది. అంతే కాకుండా కథలోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లడానికి ఈ 4 ఎపిసోడ్స్‌ను ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత 4 ఎపిసోడ్స్ నుండే అసలు కథ మొదలవుతుంది. సరిపడా ట్విస్టులతో, మంచి యాక్టింగ్‌తో ప్రేక్షకులు ఎంటర్‌టైన్ చేసే వెబ్ సిరీస్ ఇది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కొరియన్ సిరీస్ చూడాలనుకుంటే ‘నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ది ఫ్రాగ్’పై ఓ లుక్కేయండి.

Related News

Ott movies: ప్లే బాయ్ అమ్మాయిల దీవిలో చిక్కుకుంటే? ట్విస్టుల మీద ట్విస్టులు.. మూవీ నెక్ట్స్ లెవల్ అంతే!

Sector 36: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?

OTT Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం మూవీ.. వామ్మో ఇన్ని ట్విస్టులా?

Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యానిమల్’ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

The GOAT OTT: ‘గోట్’ ఓటీటీ స్ట్రీమింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్, అలా రిలీజ్ చేస్తారట!

Stree 2 OTT: ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోన్న ‘స్త్రీ 2’.. ఎప్పటి నుంచంటే?

Big Stories

×