EPAPER
Kirrak Couples Episode 1

OTT Movie: పోలీసే తోటి పోలీసులను టార్గెట్ చేస్తే? ఇలాంటి షాకింగ్ క్లైమాక్స్ మరే సినిమాలో చూసి ఉండరు!

OTT Movie: పోలీసే తోటి పోలీసులను టార్గెట్ చేస్తే? ఇలాంటి షాకింగ్ క్లైమాక్స్ మరే సినిమాలో చూసి ఉండరు!

Thalavan Movie: పగ, ప్రతీకారం కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘తలవన్‌’. పోలీసులు డిపార్ట్ మెంట్ లో పని చేస్తూ, పోలీసుల మీదే ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో అద్భుతం చూపించారు దర్శకుడు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి కథ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


‘తలవన్‌’ స్టోరీ ఏంటంటే..   

సినిమా ప్రారంభం కాగానే, వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్న డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్ భాను చూపిస్తారు. ఆయన ఓటీవీ చానెల్ లో తన కెరీర్ లో చూసిన క్రైమ్ స్టోరీల గురించి చెప్తాడు. వాటిని ఆ ఛానెల్ వాళ్లు ఎపిసోడ్లుగా టెలీకాస్ట్ చేస్తారు. అందులో భాగంగానే జాపనంతోటలో జరిగిన కేసు గురించి చెప్తారు. ఈ కేసు వల్లే తనకు  చెడ్డపేరు వచ్చినట్లు చెప్తారు. అక్కడే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..  2019లో ఎస్ఐ కార్తిక్ వాసు దేవ‌న్ (ఆసిఫ్ అలీ) బదిలీ మాద సీఐ జ‌య‌ శంక‌ర్ (బిజు మేన‌న్‌) పని చేసే స్టేషన్ కు వస్తాడు. యువకుడైన కార్తిక్ కాస్త దూకుడుగా ఉంటారు. అది సీఐకి నచ్చదు. అదే సమయంలో ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు. అదే పోలీస్ స్టేషన్ లో రఘు కానిస్టేబుల్ గా పని చేస్తాడు. తన భర్త తాగి తనతో దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఓ నటి ఫిర్యాదు చేస్తుంది. అదే అదునుగా తీసుకున్న రఘు ఆ నటి ఇంటికి వెళ్లి తప్పుగా ప్రవర్తిస్తాడు. ఈ విషయం సీఐ శంకర్ సదరు నటి చెప్పడంతో శంకర్ అక్కడికి వచ్చి, రఘును బాగా తిట్టి 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. 6 నెలల తర్వాత మళ్లీ డ్యూటీలో చేరుతాడు. కానీ, ఆయనకు సీఐ మీద బాగా కోపం ఉంటుంది.


సీఐ భార్యపై హత్యాయత్నం

ఒకరోజు సీఐ తన భార్య సునీతను ఆమె పని చేసే స్కూల్ దగ్గర దించి వెళ్తారు. కాసేపటికే జోషి అనే కిరాయి గూండా ఆమె మీద కత్తితో దాడి చేస్తాడు. పోలీసులు అతడిని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తే వేరే మహిళను చంపబోయి ఆమె మీద దాడి చేశానని చెప్తాడు. ఈ దాడి నుంచి సునీత నెమ్మదిగా కోలుకుంటుంది. అదే సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన మ‌నుదాస్ అనే స్నేహితుడిని జ‌య‌శంక‌ర్ అనుమ‌తి లేకుండా ఎస్సై కార్తిక్ రిలీజ్ చేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అక్కడి నుంచి సీఐ శంకర్ మనుదాస్ ను అరెస్టు చేయడానికి వెళ్తుండగా, జోషి భార్య రమ్య వచ్చి సీఐ శంకర్ తో తన భర్త బయటకు రావాలంటే కేసు వాపస్ తీసుకోవాలని కోరుతుంది. అవసరమైతే డబ్బు ఇస్తానని చెప్తుంది. దీంతో ఆయన ఆమెపై కోపంతో అరిచి అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తాడు. నేరుగా మనుదాస్ ఇంటికెళ్లి అరెస్టు చేస్తాడు. దీంతో మనుదాస్ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దీంతో మనుదాస్ సీఐ మీద కోపం పెంచుకుంటాడు. మరోవైపు సీఐ, ఎస్సై మధ్య గొడవ పెరుగుతుంది.

సీఐ ఇంటిపై గోనె సంచిలో మహిళ డెడ్ బాడీ

అటు జాపనంతోటలో జరిగే తిరునాళ్లు వేడుకలో ఎస్సై  తన టీమ్ తో బందోబస్తులో ఉంటారు. డిప్యూటీ ఎస్పీ ఉదయ్ భాను సీఐ శంకర్ ఇంటి డాబాపై మద్యం తాగుతూ ఉంటారు. అప్పుడే ఎస్సై కార్తిక్ కు ఫోన్ చేసి సీఐ ఇంటికి రమ్మని చెప్తాడు. సీఐ, ఎస్సై మధ్య మనస్పర్థలను తొలగించే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఇద్దరూ వెనక్కి తగ్గరు. కోపంతో కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం సీఐ తన డాబా మీదికి వెళ్లగానే అక్కడ ఓ గోనె సంచి కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూడగానే అందులో జోషి భార్య రమ్య శవం ఉంటుంది. వెంటనే ఈ విషయం, పోలీసులకు తెలుస్తుంది. ఎస్సై, డిప్యూటీ ఎస్పీతో పాటు ఎస్పీ అక్కడికి చేరుకుంటారు. క్రైమ్ సీన్ ను పరిశీలిస్తారు. అప్పుడే అక్కడికి శంకర్ భార్య సునీత కూడా వస్తుంది.  చనిపోయిన రమ్య గురించి సీఐతో ఎస్పీ ఆరా తీస్తాడు. కిరాయి గూండా జోషి భార్య అయిన రమ్య తరచుగా తన దగ్గరికి వచ్చి ఆమె భర్త మీద పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరేదన్నారు. నిన్న కూడా వచ్చిందని, కుదరదని చెప్పి పంపించానని చెప్తాడు. అయితే, ఈ కేసులో సీఐ శంకర్ ను అరెస్టు చేస్తారు. కానిస్టేబుల్ రఘ చాలా సంతోషపడుతాడు. శంకర్ కు కోర్టు రిమాండ్ విధిస్తుంది.

కేసు విచారణ బాధ్యతలు తీసుకున్న ఎస్సై కార్తిక్

ఈ కేసును విచారణ డీఎస్పీ స్థాయి అధికారి చేయాల్సి ఉన్నా, తన మామ అయిన మంత్రి సూచన మేరకు ఎస్సై కార్తిక్ రంగంలోకి దిగుతాడు. రమ్య ఇంటికి వెళ్లి ఆరా తీస్తాడు. జైల్లో శంకర్ చాలా బాధపడుతాడు. ఇదంతా ఎలా జరిగింది? అని ఆలోచిస్తాడు. నిజానికి ఆయన ఈ హత్య చేయడు. అదే విషయాన్ని ఆలోచిస్తూ సెల్ నుంచి బయటకు వచ్చి ముఖం కడుక్కుంటుండగా, అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న జోషి కత్తితో తన మీద దాడి చేస్తాడు. కార్తిక్ అక్కడికి వచ్చి జోషితో మాట్లాడగా, అతడే తన భార్యను చంపాడని, తన కూతురిని మాయం చేశాడని చెప్తాడు. అదే సమయంలో నువ్వు శంకర్ సర్ భార్యను ఎందుకు చంపాలి అనుకున్నావ్? అని అడుగుతాడు. దానికి కాస్త వణుకుతూ వేరొక మహిళను చంపాలనుకుని తనను చంపానని చెప్తాడు. కానీ, తనేదో దాస్తున్నాడని కార్తిక్ కు అనిపిస్తుంది. అయితే, జోషికి రమ్య కాల్ చేసినప్పుడు తను సీఐ ఇంటికి తీసుకెళ్లే ఆటో డ్రైవర్ పేరు సింటో అని చెప్తుంది. సింటో అనే పేరుతో ఉన్న ఆటో డ్రైవర్ కోసం వెతుకుతాడు కార్తిక్.

సింటో టార్గెట్ గా పోలీసులు విచారణ

అదే సమయంలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శంకర్, రెస్ట్ కోసం 18 రోజుల బెయిల్ లభిస్తుంది. ఈ సమయంలో రమ్య కిల్లర్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అదే రోజు రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి సీఐ బైక్ మీద పెట్రోల్ పోషి తగలబెడతాడు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని కార్తిక్ అర్థం చేసుకుంటాడు. తన పెళ్లి ఆగిపోయేందుకు కారణం అయిన మనుదాస్ ఈ పని చేసి ఉంటాడని డిప్యూటీ ఎస్పీ ఉదయభాను అంటాడు. మనుదాసును పట్టుకొచ్చి పోలీసులు ఇబ్బంది పెడతాడు. కానీ, తాను ఆ పని చేయలేదని చెప్తాడు. గతంలో పట్టాడి స్టేషన్ లో సీఐ శంకర్ పని చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అతడిపై కత్తితో దాడి చేశాడని,  అతడి పేరు సింటో అని తెలుస్తుంది. సింటో పేరు వినగానే కార్తిక్ షాక్ అవుతాడు. శంకర్ ను పొడిచిన రోజు సింటోతో ఉన్నవారి ఫోటోలను  చూపిస్తారు అక్కడి పోలీసులు. ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారని చెప్తాడు. కేసు పెట్టని ఆ అబ్బాయి తండ్రి శివదాసన్ ఇదే స్టేషన్ లో ఏఎస్ఐగా పని చేశాడని చెప్తారు. తనను కలిస్తే ఎక్కువ సమాచారం లభిస్తుందంటారు. వెంటనే కార్తిక్ శివ దాసన్ ఇంటికి వెళ్లి ఈ విషయం గురించి అడుగుతాడు. సింటో గ్యాంగ్ గురించి చెప్పాలంటాడు. నా కొడుకు పేరు అరుణ్. సింటో గ్యాంగ్ తో తిరిగేవాడు. అరుణ్ ఓ రోజు తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని సింటో గ్యాంగ్ తో కలిసి జలపాతం దగ్గరికి వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లే ఓ కానిస్టేబుల్ వారితో అసభ్యంగా మాట్లాడ్డంతో అంతా కలిసి అతడిని కొట్టారు. అటుగా వచ్చిన సీఐ సింటో గ్యాంగ్ పట్టుకుని తీవ్రంగా కొడతాడు. అప్పుడే సింటో శంకర్ మీద కత్తితో దాడి చేశాడని చెప్తాడు. అయితే, తన కొడుకు మీద కేసు పెట్టొద్దని వేడుకోవడంతో వదిలేస్తారు. ఆ తర్వాత తన కొడుకు ఐర్లాండ్ కు పంపించినట్లు చెప్తాడు. సింటో జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నట్లు చెప్తాడు.

అరుణ్ విదేశాలకు వెళ్లకున్నా వెళ్లినట్లు ప్రచారం

మొత్తంగా ఈ కేసులో కీలక నిందితుడు సింటో అని కార్తిక్ భావిస్తాడు. పై అధికారులకు కూడా చెప్తాడు. అదే సమయంలో సీఐ శంకర్ కు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సింటో కార్తిక్ ఇంట్లో ఉన్నాడని చెప్తాడు. అదే సమయంలో కిల్లర్ ఆటోలో వచ్చి కార్తిక్ ఇంటి ముందు ఓ పెట్టెను పడేసి వెళ్తాడు. కార్తికి బయటకు వచ్చిన ఆ బాక్స్ చూడగానే అందులో సింటో డెడ్ బాడీ ఉంటుంది. అప్పుడే అక్కడికి శంకర్ వచ్చి సింటోడెడ్ బాడీ చూస్తాడు. నువ్వంటే నువ్వే సింటోను చంపావంటూ ఇద్దరూ గొడవ పడుతారు. అదే సమయంలో విషయం పోలీసులకు తెలుస్తుంది. అయితే, కిల్లర్ కావాలనే తమను ఈ కేసులో ఇరికిస్తున్నాడని సీఐ, ఎస్సై భావిస్తారు. ఇద్దరూ కలిసి రహస్యంగా ఈ కేసు విచారణ చేస్తారు. ఇందులో తన టీమ్ మెంబర్ బెన్నీ ఈ కేసులో ఓ కీలక ఆధారం లభించిందని కార్తిక్ కు మెసేజ్ పెడతాడు. కాల్ చేస్తే అతడి ఫోన్ కలవదు. బెన్నీ గురించి ఆరా తీస్తే తను ఉదయం పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లినట్లు తెలిసి వాళ్లు అక్కడికి వెళ్తారు. సింటో అతడి గ్యాంగ్ లో పాస్ పోర్టు ఉన్నవారి గురించి తెలుసుకునేందుకు వచ్చారని చెప్తారు. కార్తిక్ ఆలిస్టు చూడగా, అందులో సింటో, అరుణ్ కు మాత్రమే పాస్ పోర్టు ఉన్నట్లు తెలుస్తుంది. అటు బెన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ ప్రాంతంలో శివదాసన్ ఇల్లు ఉంటుంది. అరుణ్ ఐర్లాండ్ లో చనిపోయాడని, తన భార్య అతడికి అక్కడే అంత్యక్రియలు చేశారని చెప్తాడు. అక్కడి నుంచి ఎస్సై, సీఐ ఓ సీక్రెట్ ప్లేస్ కు వెళ్తారు. అరుణ్ గురించి ఆరా తీస్తే, అసలు అతడు ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లలేదని చెప్తాడు. ఇద్దరూ షాక్ అవుతారు.

అసలు నిందితుడు ఏఎస్సై శివదాసన్

ఇక కార్తిక్, శంకర్ అరుణ్ తండ్రి శివదాసన్ ఇంటికి వెళ్లి అతడిని కొట్టి నిజం చెప్పాలంటారు. అరుణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటారు. శివదాసన్ అసలు విషయం చెప్తాడు. సింటో గ్యాంగ్ తో అరెస్ట్ చేసిన మరునాడే అరుణ్ ఆత్మహత్య చేసుకుంటాడు. స్టేషన్ లో తను ప్రేమించిన అమ్మాయి ముందే తనన పోలీసులు కొట్టడాన్ని చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా, ఇంట్లోనే పూడ్చి పెడతాడు శివదాసన్. తన కొడుకు పై చదువుల కోసం అరుణ్ ఐర్లాండ్ కు వెళ్లాడని చెప్తాడు. తన కొడుకు చావుకు కారణం శంకర్ అని భావించి, జోషికి డబ్బులు ఇప్పించి శంకర్ భార్య మీద  దాడి చేయిస్తాడు. అయితే, శంకర్ భార్యను చంపమని శివదాసన్ తనకు సుపారీ ఇచ్చిన విషయాన్ని జోషి తన భార్య రమ్యకు చెప్తాడు. ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయటకు చెప్తుందోనని ఆమెను చంపి గోనెసంచిలో కట్టి శంకర్ డాబా మీద పడేస్తాడు. కేసును డైవర్ట్ చేయడానికి సీఐ బైక్ ను కూడా సింటోనే తగలబెడతాడు. తర్వాత రోజు సింటో శివదాసన్ ఇంటికి వెళ్లి డబ్బులు ఇంకా ఇవ్వాలని అడగడంతో అతడిని కూడా చంపి ఎస్సై ఇంటి ముందు పడేస్తాడు. వెంటనే కార్తిక్, శంకర్ శివదాసన్ ను కొట్టి అరెస్టు చేస్తారు. అక్కడే బంధించిన బెన్నీని విడిపించి తీసుకెళ్తారు. అసలు కిల్లర్ శివదాసన్ అని తెలిసి పోలీసులు షాక్ అవుతారు అని డిప్యూటీ ఎస్పీ ఉదయ్ భాను చెప్తాడు.

డిప్యూటీ ఎస్పీని చంపింది ఎవరు?

అయితే, ఈ కేసు ఇక్కడితో ఆగిపోలేదని ఉదయ్ భాను చెప్తాడు. తర్వాతి ఎపిసోడ్ లో తాను చెప్పబోయే విషయం వల్ల ఈ కేసులో ఎక్కువగా వినని ఓ వ్యక్తి గురించి కీలక విషయాలు బయటకు వస్తాయని చెప్తాడు. ఈ ఎపిసోడ్ టీవీలో వచ్చిన రోజే ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తారు. కార్తిక్, శంకర్ క్రైమ్ స్పాట్ కు వస్తారు. ఇంతకీ అతడిని చంపింది ఎవరో తెలియాంటే రెండో భాగం చూడాలంటూ మేకర్స్ ట్విస్ట్ ఇస్తారు. ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.

Read Also:కూతురి శవం కోసం 15 ఏళ్లుగా ఆ తండ్రి తవ్వని ప్రాంతం లేదు.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది!

Related News

Karthi: సత్యం సుందరం సినిమాకి ఓటిటి పార్ట్నర్ ఫిక్స్

OTT Movie : బావి వల్ల ఒక్కొక్కరుగా టీనేజర్స్ మిస్సింగ్… సీను సీనుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ

OTT Movie: అమ్మాయిలను చంపి ఆ కోరిక తీర్చుకునే సైకో… భయంతో చెమటలు పట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒక జంట ప్రాణాలను బలి తీసుకున్న హార్రర్ మూవీ… నవ్వుతోనే భయపెట్టే డేంజరస్ సినిమా

OTT Movie : హనీమూన్ లోనే భర్తకు గుడ్ బై, ఇంకొకరితో భార్య ఎఫైర్… కడుపులో బిడ్డకు తండ్రులు మాత్రం ఇద్దరు 

OTT Movie : సైకియాట్రిస్ట్ నే కిడ్నాప్ చేసి చుక్కలు చూపించే సైకో… హాలీవుడ్ రేంజ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×