OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ ను చూడటానికి మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఈ మూవీలో వచ్చే రొమాంటిక్ సీన్స్, సస్పెన్స్ సీన్స్ ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. కొన్ని సినిమాలు ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. థియేటర్లలో సక్సెస్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ హాలీవుడ్ మూవీ పేరు “ది గ్లాస్ హౌస్” (The Glass House). ఈ మూవీలో హీరో ఒక అద్దాలమేడలో ఉన్న ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య ఇరుక్కుపోతాడు. ఆ ఇంట్లో నుంచి అతడు బయటపడతాడా అనే కథ తో ఈ మూవీ నడుస్తుంది. ఆ ముగ్గురితో హీరో నడిపే రొమాంటిక్ సీన్స్ చాలా రసవత్తరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక అడవిలో ఉన్న అద్దాలమేడలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అందులో తల్లితోపాటు ముగ్గురు అక్క చెల్లెలు బీ,ఈవ్, డైసీ ఉంటారు. వీరికి ఒక తమ్ముడు గేబ్ కూడా ఉంటాడు. వీరి ప్రాంతంలోకి ఎవరైనా వస్తే వీళ్ళు వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి రావడంతో అతడిని చంపి వాళ్ళ ఆచారం ప్రకారం ఆ బాడీని ముక్కలు చేసి పాతి పెడటారు. కొద్దిరోజుల తర్వాత హీరో అక్కడికి వస్తాడు. అతడిని ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన బీ చంపకుండా ప్రాణాలతో పట్టుకొని గొలుసులతో కట్టేస్తుంది. అతడిని చంపకుండా ఎందుకు వదిలేసావు అని ఈవ్ కోపగించుకుంటుంది. అతడు చూడటానికి అందంగా ఉండటంతో అతడిని బీ ప్రేమిస్తుంది. ఈ విషయం ఈవ్ కి నచ్చదు. ఒకరోజు బి, హీరో ఇద్దరూ ఒకచోట ఇంటిమేట్ అవుతూ ఉంటారు.
ఇది చూసిన ఈవ్ నువ్వు అతడిని ఎక్కువగా నమ్ముతున్నావంటూ తన చెల్లిని హెచ్చరిస్తుంది. ఇంతలోనే వీళ్ళ తమ్ముడు యుక్త వయసుకు రావడంతో అతడిని తల్లి ఒక రూమ్ లో బంధిస్తుంది. ఆతరువాత హీరో కొద్దిరోజుల సమయంలోనే వీళ్ళతో కలిసి పోతాడు. అయితే హీరో వల్ల బి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇంతలో ఒక సీక్రెట్ బయటపడుతుంది. హీరో చిన్నప్పుడు ఇంటిలో నుంచి వెళ్లిపోయిన తన కొడుకే అని ఆ అమ్మాయిల తల్లి గ్రహిస్తుంది. అయితే హీరో నేను మీరు అనుకుంటున్న వ్యక్తి కాదని ఆమెకు చెప్తాడు. ఈ విషయం తెలిసిన తల్లి హీరోని ఏం చేస్తుంది? ఆ అద్దాల మేడ నుంచి హీరో బయటపడగలిగాడా? ఇంతకీ ఆ ఇంటికి ఎవరైనా సమీపిస్తే వీళ్ళు ఎందుకు చంపుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ది గ్లాస్ హౌస్ (The Glass House) మూవీ ని తప్పకుండా చూడండి. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ హద్దులు దాటిపోతాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ ఈ మూవీని చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు.