OTT Movie : రొమాంటిక్ మూవీస్ కు పెట్టింది పేరు హాలీవుడ్. రొమాంటిక్ సీన్స్ లేకుండా హాలీవుడ్ చిత్రాలను ఊహించుకోలేం. ఆ సీన్స్ చూస్తూ బో*ల్డ్ మూవీ లవర్స్ పండగ చేసుకుంటారు. అటువంటి ఒక బో*ల్డ్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ పేరేమిటి ?ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు “ప్లెజర్” (Pleasure). ఒక అమ్మాయి తను పెద్ద అడల్ట్ స్టార్ కావాలనుకొంటుంది. పేరు, డబ్బు కోసం ఆమె చేసే అడల్ట్ సన్నివేశాలతో ఈ మూవీ కథ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జూలీ అనే అమ్మాయి అడల్ట్ స్టార్ కావాలని లాస్ వెగాస్ కి వెళ్తుంది. అక్కడ జూలీ ఇద్దరు స్నేహితులతో కలసి ఒక రూమ్ లో ఉంటుంది. ఒకరోజు జూలీ ఫిల్మ్ స్టూడియోకి వెళ్లి తను ఏం కావాలనుకుంటుందో ఆ స్టూడియో ఓనర్ కి చెప్తుంది. అయితే అతను ఒక అవకాశం ఇచ్చి ఆమెతో అడల్ట్ మూవీ తీస్తాడు. దీనితో సంతృప్తి చెందని ఆమె నాకు ఇంకా పేరు కావాలి ఏంచేస్తే వస్తుందని అడుగుతుంది. అప్పుడతను నువ్వు పెద్ద స్టూడియోలో సినిమా చేయాలి అప్పుడే నీకు పెద్ద పేరు వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత జూలీ ఒక పెద్ద స్టూడియో కి వెళ్తుంది. అక్కడ ఈవ అనే అమ్మాయి అప్పటికే చాలా పాపులర్. ఆమె ఒక పెద్ద కంపెనీ తరపున మూవీస్ చేస్తూ ఉంటుంది. అంతలా నాకు కూడా పేరు కావాలి అని అనుకుంటుంది జూలీ.
ఒకరోజు అడల్ట్ మూవీ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు జూలీని చాలా చిత్రహింసలు పెడతారు. ఆ టార్చర్ ని తట్టుకోలేక మధ్యలోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఆ స్టూడియో వాళ్ళు అవకాశం ఇవ్వరు. జూలీకి ఏంచేయాలో తెలీక చివరి ప్రయత్నం గా ఆ పెద్ద స్టూడియో ఓనర్ తో మాట్లాడి అతనిని మెప్పించి అవకాశాలు పొందుతుంది. అనుకున్నట్టుగానే ఆమెకు కొద్ది రోజుల్లోనే మంచి పేరు వస్తుంది. ఇంతలో జూలీ తన ఫ్రెండ్ ని కూడా ఈ మూవీస్ తీయడానికి రెకమెండ్ చేస్తుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జూలీ ఎదుర్కొన్న ఆ సంఘటనలు ఏమిటి? చివరికి జూలీ జీవితం ఏమవుతుంది? జూలీ ఫ్రెండ్స్ కి జూలీ కి మధ్య ఏం జరుగుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ బో*ల్డ్ మూవీ ప్లెజర్ ని తప్పకుండా చూడండి. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. మరెందుకు ఆలశ్యం రొమాంటిక్ మూవీ లవర్స్ ఈ మూవీపై కూడా ఓ లుక్ వేయండి.