OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజులలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీలను ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూడటానికి మూవీ లవర్స్ ఇష్టపడతారు. మంచి కథతో పాటు బో*ల్డ్ కంటెంట్ ఉంటే ఆ మూవీని వేరే లెవెల్ లో చూస్తారు మూవీ లవర్స్. అటువంటి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సాజ్జేషన్ లో తెలుసుకుందాం.ఈ మూవీ పేరు ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
మనం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ పేరు “మిస్టర్ ఫో” (Mister Foe).ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. తల్లిని కోల్పోయిన కొడుకు ఎటువంటి అలవాట్లకు బానిస అవుతాడో ఈ మూవీలో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హెలెన్ తన తండ్రితో పాటు సవతి తల్లితో కలసి ఉంటాడు. ఇతనికి లూసి అనే సిస్టర్ ఉంటుంది. సవతి తల్లే తన తల్లిని చంపిందని హెలెన్ ఎప్పుడూ అనుమాన పడుతూ ఉంటాడు. ఒకరోజు లూసి పై చదువులకు బయటకు వెళ్తుండగా హెలెన్ ని కూడా చదువుకోవటానికి సిటీకి వెళ్ళమంటాడు హెలెన్ తండ్రి. అతడు తన సవతి తల్లి తనను ఇంట్లో నుంచి పంపించడానికి పథకం వేస్తుందని అనుకుంటాడు. ఈలోగా లూసి సిటీకి వెళ్లిపోతుంది. హెలెన్ అక్కడే ఉంటూ ఒక ట్రీ హౌస్ కట్టుకుంటాడు. అందులో నుంచి ఇతరులు ఏమి చేస్తున్నారో తెలుసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సవతి తల్లికి అనుమానం వచ్చి అతడు ఉన్న ట్రీ హౌస్ కి వస్తుంది. ఆమెకు ఇతడు చేసే పని అర్థమవుతుంది. హెలెన్ కూడా నా తల్లిని చంపింది నువ్వే కదా అని ఆమెతో దురుసుగా ప్రవర్తిస్తాడు. పరిస్థితి గ్రహించిన సవతి తల్లి అతనిని రెచ్చగొట్టి అక్కడే ఇంటిమేట్ అవుతుంది. ఇక్కడి నుంచి సిటీకి నువ్వు వెళ్లకపోతే ఈ విషయం మీ నాన్నకు చెప్తాను అంటూ హెలెన్ ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. చేసేదేమీ లేక అతడు సిటీకి వెళ్తాడు. అక్కడ గేట్ అనే అమ్మాయి అచ్చం తన తల్లిని పోలి ఉంటుంది.
ఆమెను వెంబడిస్తూ ఆమె పనిచేసే ఆఫీసుకు వెళ్తాడు. ఏం కావాలని ఆమె అడగగా జాబ్ కావాలని చెప్తాడు. ఆమె హెలెన్ ని తన దగ్గర జాబ్ లో పెట్టుకుంటుంది. ఒక క్లాక్ టవర్ దగ్గర రహస్యంగా ఉంటూ ఆమెనే వాచ్ చేస్తూ ఉంటాడు హెలెన్. ఒకరోజు అందులో పని చేసే వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్లి ఇంటిమేట్ అవుతుండగా అది రహస్యం గా చూసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే హెలెన్ గేట్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. హెలెన్ ఇలా రహస్యం గా చూస్తూ ఉండటాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ కనుక్కొని అతనికి వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం గేట్ కు తెలియడంతో అతనిని తన రూమ్ కి తీసుకెళ్తుంది. అతని బట్టలు మొత్తం విప్పి నీ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి అని బో*ల్డ్ గా నిలబెట్టి అడుగుతుంది. తర్వాత హెలెన్ గేట్ కి ఏం చెప్తాడు? ఇతని తల్లిని నిజంగానే సవతి తల్లి చంపుతుందా? గేట్,హెలెన్ స్టోరీ ఎలా మలుపు తిరుగుతుంది? సవతి తల్లి పై ఇతను ప్రతీకారం తీర్చుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మిస్టర్ ఫో మూవీని తప్పకుండా చూడాల్సిందే