OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అందులోనూ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ ను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. కొన్ని మూవీస్ చూస్తున్నంత సేపు మంచి ఫీలింగ్ వస్తుంది. ఎన్నో సినిమాలు యూత్ ని ఎంటర్టైన్ చేసేయ్ కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇది ఒక హాలీవుడ్ మూవీ. ప్రాణంగా ప్రేమించే ప్రియుడ్ని వదిలేసి తన సుఖం కోసం వేరొక బాయ్ఫ్రెండ్ ని వెతుక్కునే అమ్మాయి చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు “కిల్లింగ్ మీ సాఫ్ట్ లీ” (Killing me softly). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
అలైస్, జాక్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఒకరోజు అలైస్ ఆఫీస్ కి వెళ్తుండగా దారిలో ఆడమ్ అనే వ్యక్తి కనబడుతాడు. అతడిని చూడగానే అలైస్ అతనికి ఆకర్షితురాలు అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అలైస్ తో ఆడమ్ ఒకసారి ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అలైస్ నేను తప్పుచేశానని జాక్ తో అసలు విషయం చెప్తుంది. నాతో రిలేషన్ లో ఉంటూ అతనితో ఎలా ఉంటావు అంటూ తన మీద కోప్పడతాడు జాక్. దీంతో ఆడమ్ ను వదులుకోలేక ప్రస్తుతం ఉన్న బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్తుంది. ఆ తర్వాత ఆడమ్ దగ్గరికి అలైస్ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ తర్వాత అతని ఇంటికి ఏవో లెటర్ లు వస్తూ ఉంటాయి. ఆడమ్ మంచివాడు కాదని ఆ లెటర్లో రాసి ఉంటుంది. ఈ లెటర్స్ ఎవరు రాస్తున్నారో తెలుసుకొని ఆడమ్ గురించి ఏమైనా రహస్యాలు తెలుస్తాయేమోనని అలైస్ ప్రయత్నిస్తుంది.
ఈ ప్రయత్నంలో ఆమె దిమ్మతిరిగే విషయాలు తెలుసుకుంటుంది. ప్రాణంగా ప్రేమించిన జాక్ ని వదులుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఆడమ్ తో నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు చాలా చెడ్డవాడివి అని చెప్తూ, అతనితో గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన అలైస్ కి వింత అనుభవం ఎదురవుతుంది. చివరికి ఆడమ్ గురించి అలైస్ తెలుసుకున్న విషయాలు ఏంటి? పోలీస్ స్టేషన్లో అలైస్ కు ఎదురైన వింత అనుభవం ఏమిటి? ఆడమ్ వల్ల అలైస్ ఎదుర్కొన్న సమస్యలేంటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “కిల్లింగ్ మి సాఫ్ట్ లి” (Killing me softly) అనే మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది.