EPAPER

OTT Movie : ముసలాడిగా పుట్టి, పెరిగే కొద్దీ యంగ్ అయ్యే హీరో… గూస్ బంప్స్ తెప్పించే బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ముసలాడిగా పుట్టి, పెరిగే కొద్దీ యంగ్ అయ్యే హీరో… గూస్ బంప్స్ తెప్పించే బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : సాధారణంగా మనిషి పుట్టినప్పుటి నుంచి ముసలాడు అయ్యేదాకా బాల్యం, టీనేజ్, యూత్, ఓల్డ్ ఏజ్ ఇలా ఉంటుంది లైఫ్ సైకిల్. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మాత్రం హీరో పుట్టడమే ముసలాడిగా పుట్టి, ఏజ్ పెరుగుతున్న కొద్ది చిన్న పిల్లాడిలా మారిపోతాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అనే విషయాలను చూసేద్దాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. అందులోనూ ఈ సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలను చూసి చూసి బోర్ గా ఫీల్ అయ్యే వాళ్లకు ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళ్తే…

ఓపెన్ చేస్తే.. సినిమా స్టార్టింగ్ లోనే ఓ ముసలావిడ హాస్పిటల్ బెడ్ పై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. తల్లిని ఆ దీనస్థితిలో చూసిన కూతురు తట్టుకోలేక బాధతో అల్లాడిపోతుంది. ఆమె బాధను పోగొట్టడానికి తల్లి ‘బెంజమిన్’ అనే ఒక కథను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్టోరీలో బెంజమిన్ అనే వ్యక్తి పుట్టడమే ముసలివాడిగా పుడతాడు. 70 ఏళ్ల ముసలివాడే అయినప్పటికీ సైజులో మాత్రం అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడిలా ఉంటాడు. కాకపోతే అతని రూపమే కాస్త భయంకరంగా అనిపిస్తుంది. కానీ అతను పుట్టగానే తల్లి చనిపోతుంది. దీంతో అతన్ని నర్సింగ్ హోమ్ లో ఉంచి పెంచుతారు. కాలం గడిచే కొద్దీ అతను ముసలి వయసు నుంచి యంగ్ గా మారుతూ విచిత్రంగా అనిపిస్తాడు. ఒక అత్యంత అరుదైన వ్యాధి వల్ల అతను ఇలా మారతాడు అన్నమాట. కానీ ఈ ప్రపంచంలో వింతలను మరింత వింతగా చూస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరిలా కాకుండా విచిత్రంగా ముసలి ఏజ్ లో పుట్టిన బెంజిమెన్ కు చెప్పలేనన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తల్లిదండ్రులు లేరు, సపోర్ట్ చేసేవాళ్ళు అంతకన్నా లేకపోవడంతో ఎన్నోసార్లు అవమానాలను ఎదుర్కొంటాడు.

ఒకానొక టైంలో ఏడేళ్ల డైలీ అనే అమ్మాయిని కలుస్తాడు. ఇక ఆ తర్వాత యంగ్ ఏజ్ లోకి మారి అందరిలాగే పని చేయడం స్టార్ట్ చేశాక డైజీ, బెంజమిన్ ని కలుసుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉండడంతో పెళ్లికి రెడీ అవుతారు. నెక్స్ట్ ఇద్దరికీ ఒక కూతురు కూడా పుడుతుంది. కానీ బెంజమిన్ కి రోజురోజుకీ వయసు తగ్గిపోవడం సమస్యగా మారుతుంది. ఆ సమస్యను గురించి ఇంట్లో వాళ్లకు చెప్పలేక తను పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇంట్లో నుంచి పారిపోతాడు. మరి చివరికి బెంజిమెన్ ఎక్కడికి వెళ్ళాడు? అతని ఫ్యామిలీ బెంజిమెన్ ని వెతికి పట్టుకోగలిగిందా? అనే విషయాలు తెలియాలంటే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్’ అనే ఈ సినిమాను చూసి తీరాల్సిందే. కాకపోతే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ లో ఉంది. ఫ్రీగా చూడాలనుకుంటే యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ఆ సీన్స్ వల్ల భారత్ లో బ్యాన్… ఈ సినిమాలను ఎక్కడ చూడొచ్చో తెలుసా?

OTT Movie : ట్రిప్స్ వెళ్లడం అంటే ఇష్టమా? ఇలాంటి చోటుకి మాత్రం కల్లో కూడా వెళ్లొద్దు… భయంతో చెమటలు పట్టించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సీను సీనుకో ట్విస్ట్… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి అన్పించే మూవీ

OTT Movies: అసలైన దసరా షురూ.. ఒక్కరోజే ఏకంగా 14 చిత్రాలు..!

OTT Movies : ఐఎండిబి రేటింగ్ లో దుమ్ము రేపుతున్న కొరియన్ డ్రామాలు… తెలుగులో ఎక్కడ చూడొచ్చు అంటే??

OTT Movie : కులం పేరుతో బాయ్ ఫ్రెండ్ ను దూరం పెట్టే అమ్మాయి.. కడుపుబ్బా నవ్వించే అచ్చ తెలుగు కామెడీ మూవీ

Big Stories

×