OTT Movie : కరోనా పుణ్యమా అని కొరియన్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువైంది. కొరియన్ సినిమాలకు మన ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. మంచి కథతో సోలోగా సాగిపోయే కొరియన్ సినిమాలకు క్రేజ్ బాగా ఏర్పడింది. ఫీల్ గుడ్ కథతో సాగిపోయే ఒక కొరియన్ సినిమా ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇది ఒక కొరియన్ మూవీ. బాగా చదివి మంచి స్థాయిలో స్థిర పడాలనుకున్న ఒక అమ్మాయి, అనుకోని కారణాలవల్ల జైలుకు వెళుతుంది. తల్లి కూతుర్ల మధ్య ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు “2037“. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక ఊరిలో తల్లి కూతురు సంతోషంగా ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. తల్లికి మాటలు రాకపోవడంతో మూగ భాషతో తన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అయితే కూతురు మంచి స్థాయిలో ఉండాలని బాగా చదివిస్తూ ఉంటుంది. ఒకరోజు తల్లి పనిచేస్తున్న యజమాని ఆమె కూతుర్ని తనకి ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా అడుగుతాడు. అందుకు ఆమె అతనిపై కోప్పడి చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ యజమాని ఆ మరసటి రోజు బాగా తాగి చదువుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూతురిపై అఘాయిత్యం చేస్తాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ తల్లిని చంపేస్తానని బెదిరిస్తాడు. అందుకు ఆమె నా తల్లిని ఏమన్నా చేస్తాడేమో అని రాయి తీసుకొని తల మీద బాది అతన్ని చంపేస్తుంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళ్లగా ఆమెకు జరిగిన అఘాయిత్యాన్ని దాచిపెట్టి, అతన్ని నేనే చంపానని చెప్తుంది.
ఈ విషయం తెలిస్తే తన తల్లి పరువు పోతుందని మౌనంగా ఉంటుంది. కోర్ట్ ఆమెకు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తుంది. జైలులో ఆమెకు 2037 ఖైదీ నెంబర్ ఇస్తారు. అయితే ఒకరోజు అనారోగ్యంతో ఉండగా ఆమెను పోలీసులు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తారు. అయితే ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ విషయం తెలిసి తనని తాను పొడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందులో మరొక ఖైదీ ఆమెను కొట్టి, బిడ్డను చంపే హక్కు నీకు లేదు, బిడ్డను కని ఎవరికైనా దత్తత ఇవ్వు అని సలహా చెప్తుంది. కోర్టులో మరో పిటిషన్ వేసి ఈ విషయం కోర్టుకు చెప్తే నీకు శిక్ష రద్దు చేస్తారని చెప్పి జైలు నుంచి మరో పిటిషన్ వేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కోర్టుకు హాజరవుతుంది. చివరికి కోర్టులో తనపై జరిగిన అఘాయిత్యాన్ని కోర్ట్ లో చెప్తుందా? కోర్టు ఆమెకు వేసిన శిక్షణ రద్దు చేస్తుందా? తల్లి కూతుర్లు మళ్లీ సంతోషంగా జీవితం సాగిస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న 2037 మూవీని తప్పకుండా చూడండి.