EPAPER

OTT Movie : పిల్లల కోసం అలాంటి పాడు పని.. ఇదంతా నిజంగా జరిగిందంటే నమ్మడం కష్టమే, ఊపిరి బిగపట్టి చూడాల్సిన సిరీస్

OTT Movie : పిల్లల కోసం అలాంటి పాడు పని.. ఇదంతా నిజంగా జరిగిందంటే నమ్మడం కష్టమే, ఊపిరి బిగపట్టి చూడాల్సిన సిరీస్

OTT Movie : నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే కొన్ని హారర్, థ్రిల్లర్ చిత్రాలకు చివర్లో ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది’ అంటూ మేకర్స్ యాడ్ చేస్తారు. అది ప్రేక్షకుల్లో మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది. కానీ అందులో కొన్ని మాత్రమే నిజాలు ఉంటాయి. తాజాగా ఓటీటీలో విడుదలయిన ఒక మరాఠీ వెబ్ సిరీస్ మాత్రం అలా కాదు.. అసలు మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి అనిపిస్తూనే ఉంటుంది. ఆ వెబ్ సిరీస్ పేరే ‘మన్వత్ మర్డర్స్’ (Manvat Murders). అసలు ఈ వెబ్ సిరీస్ కథ ఏంటో, ఏ ఓటీటీలో ఉందో చూసేయండి.


నరబలి చుట్టూ తిరిగే కథ… 

‘మన్వత్ మర్డర్స్’ కథ విషయానికొస్తే.. మన్వత్ అనే ఊరిలో రుక్మిణి (సోనాలీ కులకర్ణి).. తనకంటే ఎక్కువ సామాజిక వర్గానికి చెందిన ఉత్తమరావు బర్హాతే (మకరంద్ అనస్పురే)ను ప్రేమిస్తుంటుంది. ఉత్తమరావును ఇదివరకే పెళ్లయినా కూడా తనతో పీకల్లోతు ప్రేమలో ఉంటుంది రుక్మిణి. తనకు పిల్లలు కావాలనే కోరిక చాలా ఉంటుంది. కానీ తనకు ఆ అవకాశం లేదని తేలిపోతుంది. ఇక మరోవైపు ఉత్తమరావుకు బంగారు నిధుల మీద ఆశ ఉంటుంది. వీరిద్దరి కోరికలు తీరడం కోసం గణపత్ సల్వే (కిషోర్ కదమ్) అనే తాంత్రికుడిని వెళ్లి కలుస్తారు. ఊరిలోని ఒక చెట్టు కింద ఒక పిల్లవాడి ఆత్మ ఉందని, నరబలి ఇస్తే ఆ ఆత్మ వెళ్లిపోతుందని చెప్తాడు తాంత్రికుడు. దాంతో వారి కోరికలు కూడా తీరుతాయని అంటాడు. దీంతో కొందరు మనుషులను పెట్టి ఊరిలోని చిన్నపిల్లలను కిడ్నాప్ చేయించి, వారిని హత్య చేయిస్తుంటారు రుక్మిణి, ఉత్తమరావు. వారిని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ రమాకాంత్ కులకర్ణి (అషుతోష్ గోవర్కర్).. ఈ కేసును ఎలా చేధించాడు అనేదే తెరపై చూడాల్సిన కథ.


Also Read: ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి ఆ పని.. ఆ సీన్స్ వల్ల థియేటర్లలో బ్యాన్ అయిన తెలుగు బో*ల్డ్ మూవీ

నిరంతరం ఆసక్తి

‘మన్వత్ మర్డర్స్’ వెబ్ సిరీస్ ప్రారంభం అవ్వగానే రుక్మిణి, ఉత్తమరావే హంతకులు అనే విషయం రివీల్ చేశాడు దర్శకుడు ఆశిష్ అవినాష్ బెండే. అయినా కూడా సిరీస్ చూడడానికి ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ఎక్కడా తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో సోనాలీ, మకరంద్, అషుతోష్ యాక్టింగే కీలకం. ఈ ముగ్గురు పోటీపడి నటిస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. పైగా ఆ హత్యలు నిజంగా ఎంత భయంకరంగా జరిగాయో.. అంతే భయంకరంగా వాటిని తెరపై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించలేదు దర్శకుడు. ‘మన్వత్ మర్డర్స్’ షూటింగ్ జరుగుతున్నంతసేపు అసలు ఇలాంటి మర్డర్స్‌ను మనుషులు చేయగలరా అని ఆశ్చర్యపోయారట మేకర్స్.

పుస్తకం ఆధారంగా

రమాకాంత్ శేషగిరిరావు కులకర్ణి.. మహారాష్ట్రలో డీజీపీగా పనిచేశారు. అలాంటి సమయంలోనే 1972 నవంబర్ 14 నుండి 1976 జనవరి 4 వరకు మన్వత్ మర్డర్స్ జరిగాయి. ఈ కేసును చేధించడంలో రమాకాంత్ పాత్ర చాలా ఉందని అప్పట్లో ప్రభుత్వం కూడా ఆయనను ప్రశంసించింది. మన్వత్ మర్డర్స్ మాత్రమే కాదు.. ఆయన చేధించిన మరెన్నో కేసులు కూడా బాలీవుడ్ వెండితెరపై సినిమాలుగా తెరకెక్కాయి. తన కేసుల గురించి ఎప్పుడూ ఇంట్లోవారితో కూడా చర్చించని రమాకాంత్.. తన అనుభవాలు అన్నీ కలిపి ‘ఫుట్‌ఫ్రింట్స్ ఆఫ్ ది శ్యాండ్’ అనే పుస్తకాన్ని రాశారు. 2004లో ఈ పుస్తకం బయటికి రాగా.. 2005లో ఆయన మరణించారు. ‘మన్వత్ మర్డర్స్’కు సంబంధించిన వివరాలు కూడా ఆ పుస్తకంలో నుండే తీసుకున్నారు. ప్రస్తుతం ‘సోనీ లివ్’లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

Related News

OTT Movie : అవసరాలు తీర్చుకోవడానికి ఆ పని… దిమాక్ ఖరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Bold Movie : బెడ్రూంలో సీక్రెట్ కెమెరాలు… పెళ్ళానికి నరకం ఎలా ఉంటుందో చూపించే సైకో

OTT Movie : చనిపోయిన కూతురు తిరిగొచ్చి ఫ్యామిలీ ప్రాణాల్ని బలి కోరితే… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : పిచ్చెక్కించే ట్రయాంగిల్ బో*ల్డ్ మూవీ… ఇద్దరబ్బాయిలతో అమ్మాయి…

OTT Movie: మనిషి బాడీ కోసం వెతికితే కోతి శవం, ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో ఆడియెన్స్‌ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే మిస్టరీ థ్రిల్లర్..

OTT Movie : కడుపుతో ఉన్న కూతురిపై కక్ష… దిమాక్ కరాబ్ చేసే సాయి పల్లవి క్రైమ్ థ్రిల్లర్

×