EPAPER

Kalki movie trimming: ఓటీటీలో కట్ అయిన కల్కి సీన్లు ఇవే..

Kalki movie trimming: ఓటీటీలో కట్ అయిన కల్కి సీన్లు ఇవే..

Kalki movie streaming in OTT with trimming scenes of 6 minutes: ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో రిలీజై వరల్డ్ వైడ్ రికార్డు కలెక్షన్లు సాధించింది కల్కి 2898 ఏడీ. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్లు సాధించలేదు. ఇక బాలీవుడ్ షారుక్ రికార్డులు కూడా బద్దలు కొట్టేసింది కల్కి. ఇక ఈ మూవీ రెండో భాగం కోసం ప్రేక్షకాభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆగస్టు 22 నుంచి అభిమానుల కోరికమేరకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్స్ లో కల్కి మూవీ ని అందుబాటులో ఉంచారు నిర్మాతలు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే థియేటర్ లో ప్రదర్శితమైన కల్కి మూవీకి ఏకంగా ఆరు నిమిషాల నిడివి కుదించారు కొన్ని ల్యాగింగ్ సన్నివేశాలు ట్రిమ్ చేశారు. అయితే ఈ మూవీలో ఏ సన్నివేశాలు తీసేశారు అని ఆసక్తిగా జనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


ఆరు నిమిషాల నిడివి కుదింపు

దాదాపు 181 మినిట్స్ ఉన్న కల్కి మూవీ ని ఓటీటీలో 175 నిమిషాలకు తగ్గించేశారు. ప్రభాస్ పరిచయ సన్నివేశం కాస్త డ్రాగ్ ఉండటంతో దానిని కొంత భాగం తగ్గించేశారు. అప్పుడే ప్రభాస్ ఇద్దరు బాడీబిల్డర్స్ తో ఫైట్ చేస్తాడు..అది కూడా ట్రిమ్ చేశారు. కాంప్లెక్స్ లో దిశపటానీతో ప్రభాస్ కలిసి పాడే పాటను పూర్తిగా తీసేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ లో కొంత భాగం కూడా తీసేయడం జరిగింది. డబ్బింగ్ కూడా చాలా చోట్ల మార్పులు చేశారు.


ట్రిమ్మింగ్ చేశాక..

కల్కి మూవీ తొలి షో నుంచే యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ కొన్ని అనవసర ల్యాగింగ్ సన్నివేశాలు ఉన్నాయని..అవి సినిమా కంటిన్యుటీని దెబ్బతీస్తున్నాయని కంప్లైంట్లు వచ్చాయి. ఓవరాల్ గా సినిమా జనానికి నచ్చేయడంతో ట్రిమ్మింగ్ జోలికి వెళ్లలేదు సినిమా యూనిట్. యథాలాపంగా అన్ని కేంద్రాలలో అలానే నడిపించారు. అయితే ఓటీటీ విషయంలో మాత్రం ఆరు నిమిషాల సన్నివేశాలు తప్పనిసరిగా కుదించాల్సి వచ్చింది. ట్రిమ్మింగ్ చేశాక కొత్త ఎక్స్ పీరియన్స్ బాగుందని అంటున్నారు ఓటీటీ ప్రేక్షకులు.

నిర్మాతలకు అభినందనలు

ఇదే పని తొలి వారం అయ్యాక థియేటర్లలోనూ చేసివుంటే బాగుండేదని అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా ట్రిమ్మింగ్ చేసే నిర్ణయాన్ని తీసుకున్న కల్కి మూవీ నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు థియేటర్లలో చూసిన ఓ అభిమాని ట్రిమ్మింగ్ చేశాక కల్కి మూవీని మరోసారి చూడాలని అనుకుంటున్నానని అన్నారు. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్ ఎక్స్ పీరియన్స్ గానే చూడాలని ..బుల్లితెరపై పెద్దగా కంటికి ఆనవని మరో అభిమాని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఈ మూవీకి వచ్చిన హైప్ తో ఇప్పుడు ఓటీటీలోనూ ప్రభంజనమే సృష్టించబోతోంది.  సైన్స్ ఫిక్షన్ డ్రామాతో ఇండియన్ మైథిలాజికల్ ను జోడించి చేసిన ప్రయోగం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేయడంతో రికార్డు బ్రేక్ కలెక్షన్లు నమోదయ్యాయి.

Related News

Ott movies: ప్లే బాయ్ అమ్మాయిల దీవిలో చిక్కుకుంటే? ట్విస్టుల మీద ట్విస్టులు.. మూవీ నెక్ట్స్ లెవల్ అంతే!

Sector 36: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?

OTT Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం మూవీ.. వామ్మో ఇన్ని ట్విస్టులా?

Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యానిమల్’ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

The GOAT OTT: ‘గోట్’ ఓటీటీ స్ట్రీమింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్, అలా రిలీజ్ చేస్తారట!

Stree 2 OTT: ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోన్న ‘స్త్రీ 2’.. ఎప్పటి నుంచంటే?

OTT: హోటల్‌లో అమ్మాయి – పిల్లాడిని ముక్కలు చేసి.. ఈ సీరిస్ చూశాక, గెస్టులు ఘోస్టుల్లా కనిపిస్తారు

Big Stories

×