EPAPER

Ott movies: ప్లే బాయ్ అమ్మాయిల దీవిలో చిక్కుకుంటే? ట్విస్టుల మీద ట్విస్టులు.. మూవీ నెక్ట్స్ లెవల్ అంతే!

Ott movies: ప్లే బాయ్ అమ్మాయిల దీవిలో చిక్కుకుంటే? ట్విస్టుల మీద ట్విస్టులు.. మూవీ నెక్ట్స్ లెవల్ అంతే!

అకస్మాత్తుగా లిన్ అనే యువకుడు అమ్మాయిలు మాత్రమే ఉండే దీవిలో చిక్కుకుపోతాడు. అసలే అమ్మాయి పిచ్చి ఉన్న లిన్.. ఆ దీవిలో ఏం చేయబోతున్నాడు? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. 2017లో వచ్చిన ‘బ్యూటీ ట్రైబ్’ అనే చైనీస్ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే.


సినిమా కథ ఏంటంటే..?

Beauty Tribe (2017) Full Movie Explained in Telugu: సినిమా ప్రారంభం కాగానే లిన్ అనే యువకుడు ఒకేసారి చాలా మంది అమ్మాయితో రిలేషన్ షిప్ కొనసాగించడాన్ని చూపిస్తారు. ఒక రోజు మరో కొత్త అమ్మాయిని బుట్టలో వేసుకుంటాడు. అదే సమయంలో ఒక గర్ల్ ఫ్రెండ్ తనకు ఫోన్ చేస్తుంటే, తనతో ఉన్న అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేస్తూ మాట్లాడుతాడు. లిన్ ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగిస్తుంటాడు. కొత్త అమ్మాయి దగ్గర బోర్ కొట్టడంతో ఆమె దగ్గర కొంత మనీతో పాటు కండోమ్స్ తీసుకుని.. కాల్ చేసి రమ్మన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎందుకో ఆ రోజు లిన్ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు అంతా చీకటిగా ఉంటుంది. లిన్ కొంచెం బెరుకుగానే లోపలికి వెళ్తాడు. అదే సమయంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ క్యాండిల్ లైట్ పట్టుకుని అందంగా తయారై అతడి దగ్గరికి వస్తుంది. ఈ రోజు స్వర్గంలో తేలిపోవాలి అనుకుంటాడు. కానీ, ఆమె దగ్గరకి వచ్చి బేస్ బాల్ బ్యాట్ తో తల మీద బలంగా కొడుతుంది. దెబ్బకు మూర్చపోతాడు.


బట్టలు లేకుండా ఎడారిలో ప్రత్యక్షం

లిన్ కు మెలకువ వచ్చే సారి ఎడారిలో ఉంటాడు. కేవలం అండర్ వేర్ తో ఎండలో మాడిపోతుంటాడు. ఫోన్ ఉందేమోనని జేబులో వెతుకుతాడు. అప్పుడు ఒక కండోమ్ తో పాటు తన గర్ల్ ఫ్రెండ్స్ అంతా కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. అందులో వాళ్లంతా కలిసి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నట్లు ఉంటుంది. అసలు విషయం ఏంటంటే.. లిన్ అప్పటి వరకు ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ షిప్ కొనసాగిస్తాడు. కానీ, ఓ రోజు ఈ విషయం అందరికీ తెలుస్తుంది. వారంతా కలిసి ఇతడి మీద రివేంజ్ తీర్చుకునేందుకు తెచ్చి ఎడారిలో పడేస్తారు. ఎడారిలో ఎంతదూరం నడిచినా ఎవరూ కనిపించరు. దాహం వేస్తున్నా నీళ్లు దొరకవు. చాలా దూరం వెళ్లాక, ట్యాలియా అనే అమ్మాయిల లీడర్ తన సైన్యంతో అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిలంతా తనను ఇష్టపడుతున్నారని భావించి.. ట్యాలియా ముఖం మీది మాస్క్ తొలగిస్తాడు. ఒక అమ్మాయి అతడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. దెబ్బలకు మూర్చపోయిన లిన్ ను ఓ కర్రకు కట్టుకుని తన గూడానికి తీసుకెళ్తుంది.

ఆ గూడెంలో అంతా మహిళలే..

ట్యాలీయా వాళ్లు హలీబ్ ట్రైబ్ కు చెందిన మహిళలు. అక్కడ అంతా ఆడవాళ్లే ఉంటారు. మగవాళ్లను అక్కడ బానిసలుగా మార్చుకుని పనులు చేయించుకోవడంతో పాటు తమన సంతృప్తి పరిచేందుకు ఉపయోగించుకుంటారు. లిన్ ను అక్కడ బోనులో వేస్తారు. లిన్ మాదిరిగానే మరికొంత మంది మగాళ్లు కూడా బోనులో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అతడికి జింగ్ అనే ఆర్కియాలజిస్ట్ కనిపిస్తాడు. ఎడారిలో తవ్వకాలు జరిపేందుకు వచ్చిన కొంత మందిని ట్యాలియా సైన్యం చంపేస్తుంది. అతడిని మాత్రం ఆ ఊరి పెద్ద అయిన అయ్యగారిని తీసుకురావడంతో ప్రాణాలతో వదిలేస్తారు.

గ్రూప్ లీడర్ ట్యాలియాకు సెక్యూరిటీగా..

ఒక రోజు హలీబ్ ట్రైబ్ వాళ్లంతా ఓ పండగ జరుపుకుంటారు. బోనులో ఉన్న మగాళ్లను వరుసగా నిలబెడతారు. లిన్ ను కూడా మిగతా వాళ్లతో సమానంగా నిలబెడతారు. అలా నిలబెట్టిన మగాళ్ల అంగాలను కోసేస్తుంటారు. నెమ్మదిగా లిన్ దగ్గరికి వస్తారు. అండర్ వేర్ తొలగించగానే.. అతడి అంగాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. మిగతా వారితో పోల్చితే చాలా పొడవుగా ఉంటుంది. దీంతో అతడిని వదిలేస్తారు. పైగా గ్రూప్ లీడర్ ట్యాలియా దగ్గరకు వస్తాడు. అదే రోజు ట్యాలియాతో ఇంటిమేట్ అవుతాడు. ఆమె ఏదో టాయ్ వాడటంతో అతడి బాడీ చిత్తైపోతుంది. మరుసటి రోజు అతడు సరిగ్గా నడవలేడు కూడా. జింగ్ వచ్చి ఓదార్చుతాడు. అతడు అయ్యగారిని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె అతడితో రెండు విషయాలు చెప్తుంది. “నువ్వు మూడు నెలల్లో ట్యాలియాను ప్రెగ్నెంట్ చేయకపోతే దారుణమైన శిక్ష అనుభవిస్తావు. ప్రెగ్నెంట్ చేస్తే వెంటనే చంపేస్తారు” అని చెప్తుంది. రెండూ డేజరస్ గానే ఉండటంతో లిన్ భయపడుతాడు.

Also Read: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?

అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్

ఈ దీవి నుంచి బయటపడేందుకు జిన్ తో కలిసి ప్లాన్స్ వేస్తుంటారు. ముందు ఇక్కడి మహిళల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి అనుకుంటారు. అదే సమయంలో ట్యాలియా దగ్గరికి కమాండర్ వచ్చి మన శత్రువులైన ట్రైస్డా గ్రూప్ మనవైపు వస్తుందని చెప్తాడు. సైన్యాన్ని అలర్ట్ చేయాలని ట్యాలియా చెప్తుంది. అటు లిన్ ట్యాలియా నుంచి బ్యూటీ పార్లర్ పెట్టేందుకు అనుమతి తీసుకుంటాడు. జింగ్ తో కలిసి పార్లర్ పెట్టి అమ్మాయిలను అందంగా మార్చుతాడు. ఆ గూడెంలోని మహిళలు అందరూ లిన్ ను చాలా అభిమానంతో చూస్తారు. అదే సమయంలో చిన్న పాప డాలీ బావిలో పడినట్లు తెలుస్తుంది. ఆమెను ఎలా కాపాడాలో తెలియక అక్కడి మహిళలు ఏడుస్తారు. లిన్ ఆ పాపను తలికిందులుగా ఉంచి కడుపులో నుంచి నీళ్లు బయటకు వెళ్లేలా చేయడంతో ఆమె బతుకుతుంది. అప్పటి నుంచి లిన్ ను హీరోగా చూస్తారు. ట్యాలియా కూడా అతడిని ప్రేమగా చూస్తూ.. ఆ రోజు రాత్రి ఇంటిమేట్ అవుతుంది.

ట్రైస్డా గ్రూప్ తో ట్యాలియా టీమ్ పోరాటం

అటు తమ వైపు వస్తున్న ట్రైస్డా గ్రూప్ ను అడ్డుకునేందుకు ట్యాలీయా టీమ్ వెళ్తుంది. అదే సమయంలో గూడెంలోని ఓ బానిస ప్రజలు నీళ్లు తాగే బావిలో విషం కలుపుతాడు. అదే సమయంలో అక్కడి నుంచి బయటపడాలని లిన్, జింగ్ ప్రయత్నిస్తారు. అయితే, ట్యాలీయా టీమ్ మీద ట్రైస్డా గ్రూప్ దాడి చేసి చాలా మందిని చంపేస్తారు. ఆ రోజు రాత్రి ట్యాలియా, లిన్ ఓ గుహలో గడుపుతారు. తిరిగి గ్రామానికి వచ్చే సరికి బావిలో నీళ్లు తాగి చాలా మంది చనిపోయినట్టు తెలుసుకుంటారు. లిన్, జింగ్ పారిపోవాలని ప్రయత్నించినట్లు ట్యాలియా తెలుసుకుని వారిని ఊరి నుంచి బహిష్కరిస్తుంది. మంచి పనైందని భావించి లిన్, జింగ్ అక్కడి నుంచి బయల్దేరుతారు. కానీ, కష్టాల్లో ఉన్నవారని వదిలి వెళ్లకూడదని భావించి తిరిగి వెనక్కి వస్తాడు లిన్. అప్పటికే ట్యాలియా గ్రూప్ ను ఓడిస్తాడు ట్రైస్డా. లిన్ గుర్రం మీద వచ్చి ట్రైస్డాను చంపేస్తాడు. ట్యాలియా గ్రూప్ సంతోషం వ్యక్తం చేస్తుంది. కొద్ది రోజుల్లో ట్యాలియా ప్రెగ్నెంట్ కావడంతో అందరూ సంబురాలు చేసుకుంటారు. ఆచారం ప్రకారం తమ లీడర్ ను ప్రెగ్నెంట్ చేసిన లిన్ ను చంపేందుకు ప్రయత్నిస్తారు. అక్కడితో సినిమా అయిపోతుంది. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Related News

Best OTT Movies: ఒక షాపింగ్ మాల్.. ఒక మాస్క్ మ్యాన్.. దారుణ హత్యలు, ఇంట్రెస్టింగ్‌గా సాగిపోయే సిరియల్ కిల్లర్ మూవీ ఇది

OTT Bold Movie: టెంప్ట్ అయ్యే సీన్స్ తో అబ్బాయిల రొమాన్స్.. మరి ఇంత బో**..

Raghu Thatha On OTT: ఓటీటీలో రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ.. 24 గంటల్లో 50 మిలియన్ వ్యూస్

OTT Horror Movie : ఆ పుస్తకం చదివితే చచ్చిపోతారు… హడలెత్తించే హర్రర్ మూవీ..

Horror Movie OTT: అడుగడుగున మైండ్ బ్లాక్ అయ్యే సస్పెన్స్ మూవీ.. వామ్మో ఆ సీన్స్ ఏంటి సామి..

Sector 36: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?

Big Stories

×