EPAPER
Kirrak Couples Episode 1

Zomato Promotion : మార్కెటింగ్ కోసం మోడల్ ను రోడ్డుపై తిప్పిన జొమాటో? సీఈఓ క్లారిటీ

Zomato Promotion : మార్కెటింగ్ కోసం మోడల్ ను రోడ్డుపై తిప్పిన జొమాటో? సీఈఓ క్లారిటీ

Zomato Promotion : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల డిజిటల్ ప్రమోషన్లలో ముందుంటోంది. మొబైల్ లో జొమాటో యాప్ ఉన్న ప్రతిఒక్కరికీ.. రోజూ ఏదొక మెసేజ్ పంపుతూ.. తమ యాప్ లో ఫుడ్ డెలివరీ చేసుకోవాలని సూచిస్తుంటుంది. అయితే.. తాజాగా జొమాటో మార్కెటింగ్ గురించి నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక మోడల్ ఖాళీ జొమాటో బ్యాగ్ తగిలించుకుని.. పిక్కలు కనిపించేలా నిక్కరేసుకుని బైక్ పై ఇండోర్ లోని విజయ్ నగర్ లో తిరిగింది. వాహనదారులంతా ఆ మోడల్ ను అలా చూస్తుండిపోయారు.


ఈ వీడియోను రాజీవ్ మెహతా అనే వ్యక్తి తన X ఖాతాలో పోస్ట్ చేస్తూ.. జొమాటో మార్కెటింగ్ హెడ్ తన కంపెనీ ప్రమోషన్ కోసం ఏకంగా ఒక మోడల్ నే హైర్ చేసుకున్నారు. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఖాళీ జొమాటో బ్యాగ్ తగిలించుకుని ఆ మోడల్ బైక్ పై తిరుగుతూ.. కంపెనీని ప్రమోట్ చేస్తుందని రాసుకొచ్చారు. అక్టోబర్ 16న ఈ వీడియో షేర్ అవ్వగా.. ఇప్పటి వరకూ 1.5 మిలియన్ మందికి పైగా వీడియోనూ చూశారు.

ఈ వీడియోపై జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ స్పందించారు. ఇండోర్ లో జొమాటో ప్రమోషన్ కోసం తాము మోడల్ ను హైర్ చేసుకున్నామంటూ.. వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమన్నారు. నిజానికి ఇండోర్ లో జొమాటోకు మార్కెటింగ్ హెడ్ ఎవరూ లేరన్నారు. ఒక వేళ అలా చేయాలనుకున్నా.. హెల్మెట్ లేకుండా చేయించమని స్పష్టం చేశారు. మహిళలు ఫుడ్ ను డెలివరీ చేయడంలో తప్పులేదన్న దీపీందర్ గోయల్.. జొమాటో ద్వారా వందలాది మంది మహిళలు ఫుడ్ డెలివరీ చేస్తూ డబ్బు సంపాదించి తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారని తెలిపారు.


Tags

Related News

Quad Summit: క్వాడ్‌ దేశాల సమావేశం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Arrow Shot: దారుణం.. మహిళా ఎస్సై తలలోకి బాణాన్ని దించిన దుండగులు

Iron Rods on Trailway Track: ఓరి మీ దుంపల్ తెగ.. ఇవేం పనులు రా.. పంజాబ్ లో రైలు పట్టాలపై రాడ్లు

Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో సుప్రీం కీలక తీర్పు.. చూసినా, డౌన్ లోడ్ చేసినా నేరమే

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Ajmer Clashes: ఆజ్మీర్‌లో స్ట్రీట్ ఫైటింగ్.. రెండు వర్గాలు మధ్య రోడ్డుపై

Software Engineer: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?

Big Stories

×