EPAPER

Most Popular Chief Minister: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?

Most Popular Chief Minister: సీఎంలపై సర్వే.. పాపులర్ ముఖ్యమంత్రి ఎవరంటే?
national news today india

Most Popular Chief Minister In India: దేశంలోని ముఖ్యమంత్రులపై ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించింది. అత్యంత పాపులారిటీ ఉన్న సీఎంల జాబితాను విడుదల చేసింది. ఈ సర్వేలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ టాప్ లో నిలిచారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు రెండో స్థానం దక్కింది.


ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కు 52.7 శాతం ప్రజాదరణ ఉందని సర్వేలో తేలింది. నవీన్ పట్నాయక్ 2000 నుంచి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. దాదాపు 24 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు జనంలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే రుజువు చేసింది. రోజురోజుకు ఆయనకు ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతోంది.

సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాపులర్ సీఎంల జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆయనకు 51.3 శాతం ప్రజాదరణ ఉందని సర్వే రిపోర్టు తేల్చింది. యోగి 2017 నుంచి యూపీ సీఎంగా కొనసాగుతున్నారు.


Read More : రైతులతో నేడు నాలుగో దఫా చర్చలు.. డిమాండ్లు నెరవేరుతాయా ?

వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నాయకుడు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉందని సర్వేలో తేలింది. హిమంత బిశ్వశర్మ
48.6 శాతం పాపులారిటీతో థర్డ్ ప్లేస్ లో నిలిచారు. 2021లో అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ బాధ్యతలు చేపట్టారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాపులర్ సీఎం జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు 42.6 శాతం ప్రజాదరణ లభించింది. 41.4 శాతం ప్రజాదరణతో త్రిపుర సీఎం మాణిక్‌ సాహా ఐదో స్థానంలో నిలిచారు. మాణిక్ సహా 2016లో కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2022లో మాణిక్ సహా త్రిపుర సీఎం పదవి చేపట్టారు.

టాప్ లో ఉన్న ఐదుగురు సీఎంల్లో నవీన్ పట్నాయక్ మినహా మిగిలిన వారంతా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలే కావడం విశేషం.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×