EPAPER

Yogi Adityanath: ‘ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయండి లేకపోతే..’ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు యుపి సిఎం వార్నింగ్..

Yogi Adityanath: ‘ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేయండి లేకపోతే..’ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు యుపి సిఎం వార్నింగ్..

Yogi Adityanath| ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వలోని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల డిజిటల్ మీడియా పాలసీ పేరుతో ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వ పథకాల లభాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. సోషల్ మీడియాలో వీడియాలు, లేదా ఇతర రూపాల్లో కంటెంట్ ప్రమోట్ చేస్తే.. అలాంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ ప్రతి నెల రూ.8 లక్షల వరకు బహుమతి ఇస్తుంది. కానీ పథకాలను విమర్శిస్తూ.. వీడియోలు చేసే వారిపై యాంటీ నేషనల్ గా పరగణించి చట్టపరంగా శిక్షిస్తుంది. దీంతో ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు యోగి ఆదిత్యనాథ్.. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని ఆరోపణలు చేశాయి.


ఉత్తర్ ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీ నియమాల ప్రకారం.. ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్, ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ ఫామ్స్ లో సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రమోట్ చేస్తే.. వారి సబ్సక్రైబర్స్ ను బట్టి వారికి పారితోషకం ఇస్తుంది. అయితే ఈ చట్ట ప్రకారం.. సోషల్ మీడియా ఛెనెల్స్, కంపెనీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రభుత్వంపై అభ్యంతకర కంటెంట్ ను పోస్ట్ చేసినా.. లేదా విమర్శించాని వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు.

”నిబంధనల ప్రకారం.. ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్, ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్ ఫామ్స్ పై అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసభ్యకరంగా, యాంటీ నేషనల్ గా ఉండకూడదు,” అని ఉత్తర్ ప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అధికారిక ప్రకటన జారీ చేశారు.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందంటే..?
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మీడియా పాలసీ ప్రకారం.. ట్విట్టర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవ కోసం చేసిన పనులు, సాధించిన ఘన కార్యాలు, ప్రవేశ పెట్టిన స్కీములను ప్రమోట్ చేస్తూ.. వీడియోలు, ట్వీట్లు, పోస్ట్ లు, రీల్స్ కంటెంట్ పోస్ట్ చేయాలి. ప్రభుత్వ శాఖలు చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వ డిపార్ట్ మెంట్స్ తరపున యాడ్స్ ఇవ్వాలి. ఇలా చేసినుందుకు గాను ప్రభుత్వం ట్విట్టర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్స్‌టాగ్రామ్, యూట్యూబ్ ప్లాట్ పామ్స్ కు ఇన్‌ఫ్లుయెన్సర్ల ఫాలోయర్స్, సబ్స్‌క్రైబర్లను బట్టి వేర్వేరు కేటగిరీలుగా విభజించింది.

ట్విట్టర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్స్‌టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్, పాడ్ క్యాస్ట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రతి నెలలా రూ.8 లక్షలు, రూ.7 లక్షలు, రూ.6 లక్షలు, రూ.4 లక్షల వరకు చెల్లిస్తుంది.

ప్రతిపక్షాల విమర్శలు
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షా పార్టీలైన సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ మీడియా పాలసీపై తీవ్ర స్థాయిలో విమర్శుల చేస్తున్నాయి. ఈ చట్టం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఉల్లఘిస్తోందని తప్పుబట్టాయి.
”రాష్ట్రంలోని బిజేపీ యోగీ ప్రభుత్వం లక్షల రూపాయల ప్రజా ధనాన్ని ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తున్నట్లు అబద్ధాలు చెప్పే వారికి ఇవ్వాలని చట్టం తీసుకొచ్చింది. మరో వైపు అదే చట్ట ప్రకారం.. ప్రజా సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే.. వారిని జైలులో బంధిస్తారట. ఇలాంటి చట్టాలు ప్రజలను భయపెట్టేందుకే తీసుకొస్తోందీ ప్రభుత్వం. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసేందుకు బిజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తప్పకుండా వ్యతిరేకిస్తారు.” అని సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Also Read: ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !

Related News

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Toll Gate: ఏమిటీ ఈ దారుణం.. రోడ్డు నిర్మాణ ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా టోల్ వసూళ్లు.. కేంద్రం ఏమంటున్నదంటే?

Big Stories

×