EPAPER

Self Defence: మహిళ ముందు పాడుపని.. గరిటెతో ‘అక్కడ’ కొట్టగానే హాస్పిటల్‌కు పరుగులు!

Self Defence: మహిళ ముందు పాడుపని.. గరిటెతో ‘అక్కడ’ కొట్టగానే హాస్పిటల్‌కు పరుగులు!

Crime News: ఒక వైపు కోల్‌కతా హత్యాచార ఘటనపై దేశం అట్టుడికిపోతున్నా.. ఇలాంటి అఘాయిత్యాలు ఆగడం లేదు. మహారాష్ట్రలో ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్ట్స్ ఆమెకు చూపిస్తూ అడ్వాన్స్ తీసుకోబోయాడు. ఆ యువకుడి నుంచి తప్పించుకుని కిచెన్‌లోకి వెళ్లిన ఆ యువతి.. చేతికందిన గరిటె తీసుకుని యువకుడి ప్రైవేట్ పార్ట్‌పై ఒక్కటేసింది. ఆ యువకుడు చేతులతో బిగబట్టుకుని నేలపై పడిపోయాడు. యువతిపై అఘాయిత్యం చేద్దామనుకున్న యువకుడు ఆ తర్వాత అరుపులు, ఏడుపులతో హాస్పిటల్ చేరుకోవాల్సి వచ్చింది.


మహారాష్ట్ర థానే జిల్లా భీవండి పట్టణంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. 30 ఏళ్ల అనిల్ సత్యనారాయణ్ రచ్చ, 26 ఏళ్ల యువతికి అంతకు ముందే కొంత పరిచయం ఉన్నది. ఆ యువతి ఇంటిలో ఒంటరిగా ఉన్నదని తెలుసుకుని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అనిల్ సత్యనారాయణ్ ఆమె వద్దకు వచ్చాడు. లైంగికంగా ఆమెపై అడ్వాన్స్ తీసుకోబోయాడు. వెంటనే ఆ యువతి అతని వద్ద నుంచి కిచెన్‌లోకి పరుగెట్టింది. అనిల్ సత్యనారాయణ్ కూడా ఆమె వెంటే కిచెన్‌లోకి వెళ్లాడు. అక్కడ ఆమెతో మరింత అసభ్యంగా బిహేవ్ చేశాడు. తన ప్యాంట్‌లో నుంచి ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్‌పోజ్ చేశాడు.

ఏదో ముప్పు జరుగనుందని గ్రహించిన యువతి వెంటనే తనను తాను రక్షించుకోవాలనే ఆలోచనలో పడింది. తన చేతికి అందిన గరిటెనే వెపన్‌గా మలుచుకుంది. ఆ లోహపు గరిటెను తీసుకుని అనిల్ సత్యనారాయణ్ ప్రైవేట్ పార్ట్‌పై ఒక్కటేసింది. అనిల్ సత్యనారాయణ్ అరుస్తూ నేలను కరుచుకున్నాడు. ఊహించిన ఈ దెబ్బతో అనిల్ షాక్ అయ్యాడు.


Also Read: CM Siddaramaiah Corruption| కర్ణాటక సిఎం సిద్దరామయ్య కుటుంబంపై అవినీతి కేసు.. విచారణకు అనుమతిచ్చిన గవర్నర్!

దెబ్బ ఎక్కువ తాకడంతో విలవిల్లాడుతున్న అనిల్‌ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ అనిల్‌కు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అనిల్ సత్యనారాయణ్‌ రచ్చను ఇంకా అరెస్టు చేయలేదని, ప్రస్తుతం ఆయనకు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారని వివరించారు. చికిత్స పూర్తయిన తర్వాత అరెస్టు చేస్తామని, ఇది వరకే కేసు ఫైల్ చేశామని తెలిపారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×