EPAPER

Free Liquor in Italy:ఏం బాబూ లిక్కర్ ఫ్రీగా కావాలా? అయితే ఆ దేశానికి వెళ్లాల్సిందే మరి!

Free Liquor in Italy:ఏం బాబూ లిక్కర్ ఫ్రీగా కావాలా? అయితే ఆ దేశానికి వెళ్లాల్సిందే మరి!

Wish to enjoy free wine round the clock? Head to Abruzzo in Italy: మందు బాబులం మేము మందు బాబులం..మందు కొడితే మాకు మేమే మహారాజులం అంటూ సరదాగా పాటపాడుకునే మందుబాబులు ఎవరైనా ఉచితంగా మందు పోయిస్తామంటే చాలు ఆ ఫంక్షన్ కు తప్పనిసరిగా హాజరవుతారు. పెళ్లిళ్లు, చిన్న సైజ్ ఫంక్షన్లలో కూడా లిక్కర్ కామన్ అయిపోయింది. ఒక పక్క ఫంక్షన్ ఘనంగా జరుగుతునే ఉంటుంది. మరో పక్క ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందు విందులో స్వర్గం అంచులను తాకి వస్తుంటారు తాగుబోతులు. కొందరు లిమిట్ గా తాగితే మరికొందరు ఉచితమే కదా అని తమ కెపాసిటీకి మించి తాగుతుంటారు. ఉచితంగా మందు పోయించే కార్యక్రమాలు ప్రతి రోజూ ఉండవు కదా అందుకనే తమ సొంత డబ్బులతో మందు సామాగ్రిని కొనుక్కుంటారు.


సొంత డబ్బుతో లిక్కర్

రోజుకు రూ.500 నుంచి వెయ్యి దాకా లిక్కర్ పై ఖర్చుపెట్టాల్సిందే. అసలే చాలీచాలని జీతాలు, మధ్యతరగతి అవసరాలు వీటి మధ్య మందుకు అంతంత ఖర్చుపెట్టి తాగాలంటే ఎవరికైనా కష్టమే. అందుకే కొందరు రెగ్యులర్ గా కాకపోయినా వారానికి ఒకసారో లేక రెండు సార్లో మద్యం తాగుతుంటారు. అయితే మందు బాబులకు ఓ అదిరిపోయే న్యూస్. ఆ దేశంలో మందు కావాలంటే ట్యాప్ తిప్పుకుని తాగడమే. అది కూడా ఎంత కావాలంటే అంత. నో మనీ..ఇటలీ దేశంలో ఒర్జోనా ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఓ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. కేథరిక్ మతానికి చెందిన ఈ ఉత్సవంలో పూర్తిగా కేథరిక్ మతస్తులే పాల్గొనడం ఆనవాయితీ. వేల సంఖ్యలో రోమన్ కేథరిక్ మతస్తులు ఈ అపూర్వ కార్యక్రమానికి చేరుకుంటారు.


రెడ్ వైన్ తో ఉత్తేజం

దాదాపు 200 మైళ్ల పొడవునా ఈ యాత్ర సాగుతుంది. ఒర్టోనా కు చేరుకునే మార్గంలో ఎటువంటి ఆహార పదార్థాలు, డ్రింకులు లభ్యం కావు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇటలీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఏకంగా వైన్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆ మార్గం ద్వారా కార్యక్రమానికి చేరుకునే ప్రయాణికుల సౌకర్యార్థం అక్కడ ఉచితంగానే ట్యాప్ తిప్పగానే వైన్ వచ్చే ఏర్పాట్లు చేశారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. పైగా ప్రయాణంలో అలసి వచ్చే ప్రయాణికులు ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత రెడ్ వైన్ తాగి ఉత్తేజితులవుతున్నారు. ఉచితంగా వైన్ సేవలందిస్తున్న నిర్వాహకులను మనసారా దీవిస్తున్నారు. ఇలాంటి ఆలోచన రావడమే ఎంతో గొప్ప అని..ఎంత ఖర్చయినా భరించేందుకు ముందుకు వస్తున్న ఈ సంస్థ నిర్వాహకులకు అభినందనలు అంటున్నారు కేథలిక్ భక్తులు. మీరు ఎంతగా తాగాలనుకుంటే అంత తాగండి. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కావాలంటే బాటిళ్లలో కూడా పట్టుకెళ్లండి. మీ బంధువులకు, స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వండి అంటూ మరీ ఎంకరేజ్ చేసేలా సందేశాలు ఇస్తున్నారు నిర్వాహకులు. ఇంకేముంది మన మందుబాబులు దొరకునా ఇటువంటి సేవ అంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారక్కడ.

కేవలం భక్తితోనే..

గణేష్ ఉత్సవాల సందర్భంగా ముంబాయి, హైదరాబాద్ లోనూ కొందరు స్వచ్ఛంద సంస్థలు తాగునీటి సౌకర్యాలతో బాటు, పులిహోర, లడ్డూ ప్రసాదాలను దారి వెంట భక్తులకు పంచడం మనం చూస్తునే ఉంటాం. వీళ్లంతా డబ్బులు ఆశించి ఆ పనులు చేయరు. కేవలం భక్తుల కళ్లలో ఆనందం చూసేందుకు మాత్రమే. అయితే అంత ఖరీదైన రెడ్ వైన్ ను లీటర్లకు లీటర్లు ఎలా దానం చేస్తున్నారో అర్థం కావడం లేదు మందు బాబులకు. ఎవరైనా ఈ సారి ఇటలీ టూర్ కు వెళదామని అనుకున్నప్పడు సరిగ్గా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే సమయంలో వెళ్లగలిగితే తప్పక ఉచిత వైన్ సదుపాయం అందుకుంటారు. శీఘ్రమేవ..ఉచిత వైన్ ప్రాప్తి రస్తు..

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×