EPAPER

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ సీఎం చంద్రబాబుకే! త్వరలో ప్రకటన

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ సీఎం చంద్రబాబుకే! త్వరలో ప్రకటన

NDA Convener: ఎన్డీయే సమావేశంలో ఏం జరిగింది? మోదీ సర్కార్ అజెండా ఏంటి? కీలక విషయాలను సమావేశంలో ప్రస్తావించారా? మోదీ అజెండాపై ఎన్డీయేలోని మిగతా పార్టీలు ఏమంటున్నాయి? చర్చ జరిగిన మూడు అంశాలేంటి? మళ్లీ ఎన్డీయే కన్వీనర్‌గా సీఎం చంద్రబాబును నియమించాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. కేవలం 100 రోజుల్లో తొలి ఎన్డీయే సమావేశం జరిగింది. గురువారం చండీగఢ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేలోని పార్టీల అధినేతలు హాజరయ్యారు. రానున్న ఐదేళ్లలో బీజేపీ తన అజెండాను బయట పెట్టినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ అజెండా ఏంటి?

రాబోయే ఐదేళ్లలో ఏయే అంశాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుందో బీజేపీ వాటిని సమావేశంలో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా సమస్యలను అధిగమించాలంటే ఎన్డీయే కన్వీనర్‌ ఉండాలని కొందరు నేతలు సూచించారట. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీయే 3.0లో బీజేపీకి మెజార్టీ తక్కువగా ఉండడం ఒకటైతే, అనేక కీలకమైన బిల్లులున్నాయి.


బీజేపీ తీసుకొచ్చిన అజెండాలో ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’, జన గణన, కామన్ సివిల్ కోడ్ బిల్లులు తెచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లుకు మూడు రాజ్యాంగ సవరణలు అవసర మన్నది కొందరి నేతల మాట. దీనికితోడు మరో 15 సవరణలు చేయాల్సివుందట.

ALSO READ: భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

రాష్ట్రాలు దాదాపు 70 శాతం అంగీకరించాల్సి ఉంటుంది. దీని నుంచి గట్టెక్కాలంటే లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి. రాష్ట్రాలను ఒప్పించడం బీజేపీకి కత్తిమీద సాముగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా బిల్లులు పాస్ కావాలంటే అన్ని పార్టీలను కలుపుకు పోయే నేత అవసరమని భావించిందట ఎన్డీయే.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పేరు వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. బిల్లులకు మద్దతు విషయంలో సంప్రదింపులు, సమన్వయం చేసేందుకు ఆయనైతే బెటరని భావిస్తున్నారట కమలనాథులు.

గతంలో సీఎం చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్నప్పుడు వాజ్‌పేయ్ సర్కార్ ఐదేళ్లు సక్సెస్‌గా నడిపారు. కొన్ని బిల్లుల విషయంలో డీఎంకె పార్టీలు సైతం ఆనాడు ఆయన ఒప్పించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

దీనికితోడు జన గణనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కామన్ సివిల్ కోడ్ వ్యవహారంపై బీజేపీకి సమస్యగా మారింది. ఈ మూడు బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీయే కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారట. సందర్భాన్ని బట్టి సీఎం చంద్రబాబును కన్వీనర్‌గా ప్రకటించే అవకాశముందంటూ ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

History of Bastar Dussehra: 75 రోజుల బస్తర్ దసరా.. చరిత్ర తెలిస్తే ఔరా అంటారు!

Chennai Floods: వరదల్లో అవేం పనులు.. తలపట్టుకుంటున్న అధికారులు.. ప్లీజ్ ఆ ఒక్క పని చేయండంటూ..

Priyanka Gandhi : దక్షిణాదిలో కాంగ్రెస్ జెండాను నిలబెట్టేది ఎవరు, వయనాడ్’పై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

Big Stories

×