BigTV English

Karnataka : ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకే .. సీఎల్పీ తీర్మానం..

Karnataka : ఢిల్లీకి చేరిన కర్ణాటక రాజకీయం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకే .. సీఎల్పీ తీర్మానం..

Karnataka : కర్ణాటకలో సీఎం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడలేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలు.. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో సీఎంను ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఈ అంశంపై ఏకవాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్యే ప్రతిపాదించారు.


పార్టీ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్‌ అగ్రనేతలకు, ప్రజలకు ధన్యావాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని డీకే శివకుమార్‌ ప్రతిపాదించారు. పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6.5 కోట్ల కన్నడ ప్రజలకు సేవలందిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు.

సీఎల్‌పీ సమావేశానికి ఏఐసీసీ నుంచి పరిశీలకులుగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ శిండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ బాబ్‌రియా వచ్చారు. కర్ణాటక వ్యవహారల బాధ్యుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 135 మంది ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని భావించారు. ఎమ్మెల్యేలు ఎవరూ నిర్ణయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు.


ఇక అధిష్టానమే సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చాల్చి ఉంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు సోమవారం ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం సిద్ధరామయ్యతో మల్లికార్జున ఖర్గే భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తో పరిశీలకులు తొలుత విడిగా సమావేశమయ్యారు. ఇక సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానమే తేల్చనుంది.

Related News

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Big Stories

×