EPAPER

Neerja Bhanot : 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ హైజాక్.. ఆ రోజు ఏం జరిగింది ?

Neerja Bhanot : 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ హైజాక్.. ఆ రోజు ఏం జరిగింది ?

Neerja Bhanot : నీర్జా భానోట్.. 1983లో జరిగిన విమాన హైజాక్ గురించి తెలిసిన వారికి ఈమె సుపరిచితురాలు. పాలస్తీనా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేస్తే.. వారికి ఏ మాత్రం బెదరకుండా అనేక మంది ప్రయాణికులను రక్షించిన ధీరురాలు. 1963 సెప్టెంబర్ 7న జర్నలిస్ట్ హరీష్ భానోట్ – రమా భానోట్ దంపతులకు ఛండీగఢ్ లో జన్మించింది నిర్జాభానోట్. మోడలింగ్ వైపు అడుగులు వేసిన భానోట్.. ఆ తర్వాత విమాన అటెండెంట్ గా వృత్తిని ప్రారంభించింది. 1985లో ఫ్రాంక్ ఫర్ట్ నుండి ఇండియాకు వెళ్లే విమానాల్లో.. భారత్ కు చెందిన క్యాబిన్ సిబ్బంది కావాలని నోటిఫికేషన్ వచ్చింది. ఆ సమయంలోనే నీర్జా పాన్ ఆమ్ ఫ్లైట్ లో అటెండెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఫ్లోరిడాలోని మయామిలో శిక్షణ తీసుకుని పర్సర్ గా తిరిగివచ్చింది.


1986,సెప్టెంబర్ 5న పాకిస్తాన్ లోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిన పాన్ ఆమ్ విమానం 73ని అబు నిడాల్ ఆర్గనైజేషన్ కు చెందిన నలుగురు పాలస్తీనా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. వెంటనే ఉగ్రవాదులు ఒక ఇండో-అమెరికన్ ప్రయాణికుడిని చంపి.. మృతదేహాన్ని విమానం వెలుపల పడేశారు. విమానంలో ఉన్న అమెరికన్లను గుర్తించేందుకు నీర్జా భానోట్ ను.. వారి పాస్ పోర్ట్ లను సేకరించాలని ఆదేశించారు. అలాగే చేస్తానని చెప్పిన భానోట్.. విమానంలో ఉన్న 43 మంది అమెరికన్ల పాస్ పోర్టులను వారి సీట్లకింద దాచి పెట్టి.. వారి గుర్తింపును కనిపించకుండా చేసింది.

విమానాన్ని హైజాక్ చేసిన 17 గంటల తర్వాత.. హైజాకర్లు కాల్పులు జరపడం, పేలుడు పదార్థాలను పేల్చడం ప్రారంభించారు. ఆ సమయంలోనే నీర్జా తెలివిగా వ్యవహరించి.. ధైర్యంగా విమానం తలుపులను తెరిచింది. ముందు తన ప్రాణాలను కాపాడుకోవడం కంటే ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే బాధ్యతగా తీసుకుని ప్రయాణికులను ఉగ్రవాదుల చెర నుంచి రక్షించింది. కానీ.. దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లల్ని రక్షించే క్రమంలో నీర్జా ప్రాణాలు కోల్పోయింది. అమెరికాకు చెందిన ముగ్గురు పిల్లల్ని ఉగ్రవాదుల కాల్పుల నుంచి రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నీర్జా రక్షించిన ముగ్గురు పిల్లల్లో ఒకరు ఇప్పుడు ఎయిర్ లైన్ కెప్టెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తనకు నీర్జా భానోట్, ఆమె ధైర్య సాహసాలే తనను ప్రేరేపించాయని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. 22 ఏళ్ల వయసులో నీర్జాభానోట్ ప్రయాణికులను కాపాడేందుకు తన ప్రాణాలనే త్యాగం చేసిన గొప్ప యువతిగా చరిత్రలో నిలిచిపోయింది.


ఆమె మరణం తర్వాత.. శత్రువులను ఎదుర్కొన్న వారికి ఇచ్చే భారతదేశపు అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోకచక్ర అవార్డును అప్పటి ప్రభుత్వం ఆమె కుటుంబ సభ్యులకు ప్రదానం చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ హీరోయిజం అవార్డు అందించింది. అత్యంత చిన్న వయసులో అశోకచక్ర అవార్డును పొందిన మొదటి మహిళగా నీర్జా భానోట్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత 2004లో ఆమె స్మారక చిహ్నంగా.. ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఒక స్టాంపును కూడా విడుదల చేసింది. 2016,జులై 2న ఇంగ్లాండ్ లోని లండన్ లో హౌస్ ఆఫ్ కామన్స్, యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు భారత్ గౌరవ్ అవార్డును ప్రదానం చేశారు.

నీర్జా భానోట్ కుటుంబం ఆమె బీమా సొమ్ముతో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమాన సిబ్బందికి ఒక అవార్డు, విధినిర్వహణకు అతీతంగా ఉన్నవారికి మరొక అవార్డును అందించారు. ఈ అవార్డులో రూ.1,50,000 నగదు, ట్రోఫీ, ప్రశంసాపత్రం ఉంటాయి.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×