EPAPER

Delhi Mayor: ‘ఆప్‌’కే ఢిల్లీ మేయర్.. ఎవరీ షెల్లీ ఒబెరాయ్‌?

Delhi Mayor: ‘ఆప్‌’కే ఢిల్లీ మేయర్.. ఎవరీ షెల్లీ ఒబెరాయ్‌?

Delhi Mayor: మేయర్ పదవి కోసం ఆప్, బీజేపీ ఢిల్లీమే సవాల్ అన్నాయి. ఇప్పటికే మూడు సార్లు రచ్చ రచ్చ జరిగి మేయర్ ఎన్నిక వాయిదా పడింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. 25 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలిన బీజేపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది చీపురు పార్టీ.


ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి షెల్లా ఒబెరాయ్ (Shelly Oberoi) ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో గెలిచారు. మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా.. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు.. రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.

మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్‌కు ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అభినందనలు చెప్పారు. ప్రజలు గెలిచారని అన్నారు.


గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను ఆప్ దాటేసింది. 134 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ప్రకారం మేయర్‌ పదవి ఆప్‌కే దక్కాలి. కానీ, బీజేపీ అంత ఈజీగా అధికారం వదులుకుంటుందా? లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రూపంలో కిరికిరి స్టార్ట్ అయింది. ఎల్జీ నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి దారితీసింది. దీనిని ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్, బీజేపీ వాగ్వాదంతో మూడుసార్లు మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.

బీజేపీ తీరుతో విసిగిపోయిన ఆప్.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయకూడదని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ (MCD) సమావేశం జరగ్గా.. మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ విజయంతో.. 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర పడింది.

మేయర్‌గా ఎన్నికైన 39 ఏళ్ల షెల్లీ ఒబెరాయ్‌ కాలేజీ ప్రొఫెసర్. ఢిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్నారు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యురాలు. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ, ఇగ్నో నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇప్పుడు ఢిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×