EPAPER

Priyanka Gandhi : వయనాడ్ గెలిస్తే అమ్మ, అన్నలతో కలిసి పార్లమెంట్‌‌కు ప్రియాంక గాంధీ, కుటుంబంలో మూడో ఎంపీగా అరుదైన ఛాన్స్

Priyanka Gandhi : వయనాడ్ గెలిస్తే అమ్మ, అన్నలతో కలిసి పార్లమెంట్‌‌కు ప్రియాంక గాంధీ, కుటుంబంలో మూడో ఎంపీగా అరుదైన ఛాన్స్

Priyanka Gandhi :  కేరళలోని వయనాడ్​కు ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు కాల్​పేట్టాలో ఏర్పాటు చేసిన రోడ్ ​షాకు ప్రియాంక హాజరయ్యారు.


ఇది వయనాడ్ గౌరవం…

ముందుగా బుధవారం ఉదయం నామినేషన్​ పత్రాలపై ప్రియాంక సంతకం చేశారు. అనంతరం కాల్​పేట్టాలో భారీ రోడ్ షో ద్వారా వయనాడ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, యూడీఎఫ్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ మేరకు ప్రసంగించిన ప్రియాంక, వయనాడ్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవమన్నారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీతో పార్టీ నేతల కోసం తాను నేను గత 35 ఏళ్లుగా ఎన్నికల ప్రచారాలు చేశానన్నారు.


ఇదే తొలిసారి…

అయితే నా కోసం నేను ప్రచారం చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారన్నారు. తనకు అవకాశం ఇస్తే వయనాడ్​ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తానని, తనకు ఇదో గౌరవమని అన్నారు. మీ కుటుంబంలో భాగం కావడం నాకు గౌరవమని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ అన్నారు.

మీ ధైర్యమే నాకు స్ఫూర్తి…

ఇక వరదలు వచ్చి కొండచరియలు విరిగిపడినప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం తాను చూశానన్నారు. నాకు స్ఫూర్తినిచ్చింది ఆనాటి మీ ధైర్యమేనన్నారు.

ప్రియాంక గెలిస్తేనే ఇద్దరు ఎంపీలు… 

వయనాడ్ లో ప్రియాంక గెలిస్తే ఇక్కడి​ ప్రజల తరఫున పార్లమెంట్​లో ఇద్దరు ఎంపీలు ఉంటారని రాహుల్ గాంధీ చెప్పారు. తాను ఇక్కడ అనధికారిక ఎంపీ అన్నారు. సోదరి ప్రియాంక కుటుంబం కోసం చాలా త్యాగం చేసిందన్న రాహుల్,  ఇప్పుడు మీ అందరిని కూడా ఒక కుటుంబలాగానే భావిస్తోందన్నారు. ప్రియాంకను మీరు కూడా అలాగే చూస్తారని ఆశిస్తున్నానన్నారు. మంగళవారం రాత్రే ప్రియాంక వయనాడ్‌ చేరుకున్నారు.

ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లి సోనియా గాంధీతో కలిసి వచ్చారు. బుధవారం ఉదయం నాయకల సమక్షంలోనే తన నామినేషన్​ పత్రాలపై సంతకం చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ రాహుల్​ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఛత్తీస్​గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్​ హాజరయ్యారు.

ఒకే ఇంటి నుంచి మూడో ఎంపీగా…

ఎంపీగా ప్రియాంక గెలిస్తే తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెడతారు. ఇప్పటికే పార్లమెంట్ లో సోనియా, రాహుల్ లు రాజ్యసభ, లోక్ సభ సభ్యులుగా ఉన్నారు. ప్రియాంక గెలిస్తే ఈ సంఖ్య మూడుకు పెరుగుతుంది.

also read : రాజకీయాల్లో ప్రియాంక్ గాంధీ అధికారిక ఎంట్రీ.. వయనాడ్ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలు

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×