EPAPER

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని నాగమంగళ టౌన్‌లో 144 సెక్షన్.. గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత

Violence erupts at Nagamangala: కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో వినాయకుని నిమజ్జనంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షాపులకు నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అసలేం జరిగింది?


కర్ణాటకలోని మాండ్య జిల్లా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. నాగమంగళ పట్టణంలో గతరాత్రి వినాయకుని నిమజ్జనం జరుగుతోంది. బదరికొప్పలు గ్రామానికి చెందిన కొందరు గణపతి విగ్రహ నిమజ్జనం కోసం ఊరేగింపుగా బ్యాండ్‌తో హంగామా చేస్తూ వెళ్తున్నారు.

ALSO READ: రైల్వేలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారా? వరుస ప్రమాదాలకు కారణమేంటి?


నాగమంగళలోని మెయిన్‌రోడ్డుపై ఊరేగింపు వెళ్తుండగా, సమీపంలోని మసీదు వద్దకు రాగానే ఎవరో రాళ్లు రువ్వారు. దీంతో ఆగ్రహించిన మరో గ్రూప్, సమీపంలోని షాపులకు నిప్పు పెట్టింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పింది.

ఇరువర్గాల వారిని పోలీసులు చెరదగొట్టారు. ఆపై లాఠీ‌ఛార్జ్ చేశారు. అప్పటికే షాపులు తగలబడ్డాయి. పరిస్థితి గమనించిన పోలీసుల వెంటనే 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన హిందూ సంఘాలు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×