EPAPER

Vinesh Phogat In Haryana Polls: హర్యాణా ఎన్నికల బరిలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. రాహుల్ గాంధీతో మీటింగ్!

Vinesh Phogat In Haryana Polls: హర్యాణా ఎన్నికల బరిలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.. రాహుల్ గాంధీతో మీటింగ్!

Vinesh Phogat In Haryana Polls| అక్టోబర్ నెలలో జరగబోయే హర్యాణా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు సాధించిన ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో వివాదాస్పదంగా బహిష్కరణకు గురైన మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ తోపాటు, మరో ఒలింపిక్ విజేత బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ కార్యాలయంలో ఇద్దరూ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.


కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజకవర్గాల అంశంపై కీలక పొత్తు చర్చలు జరుగుతన్న సమయంలో ఇద్దరు ప్రముఖ పహిల్వాన్లు పార్టీలో చేరడం కీలక పరిణామం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీ తరపున జులనా నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. జులనా లో హర్యాణా స్థానిక పార్టీ అయిన జన నాయక్ పార్టీ నాయకుడు అమర్ జీత్ దండాను ఆమె ఢీకొట్టబోతున్నారు. మరోవైపు బజరంగ్ పునియా కాంగ్రెస్ గెలుచుకున్న బద్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.


వీరిద్దరికీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉండడంతో కాంగ్రెస్ బలం పెరిగడంతో, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు చర్చల విషయంపై ముభావంగా ఉన్న హర్యాణా కాంగ్రెస్ లీడర్లు పార్టీల బలాబలాలను మరోసారి అంచనా వేసే పనిలో పడ్డారు.

మంగళవారం రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు దాదాపు కుదిరిందన తరుణంలో ఇద్దరు జాతీయ స్థాయి రెజ్లర్లు ఎన్నికల బరిలో దిగడం అనూహ్య మైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నా.. ఎన్నికల్లో తమ కూటమి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ హర్యాణా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పెరిగిన బలంతో పోరాడుతామని.. బిజేపీకి కచ్చితంగా ఓడిస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోరాడుతామని తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం.. హర్యాణాలోని మొత్తం 90 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లు డిమాండ్ చేసిందని.. అయితే కాంగ్రెస్ ఏడు సీట్లు మాత్రమే ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత కోసం ఆప్ ఎంపీ రాఘ్ చడ్డా.. బుధవారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు.

రైతులతో వినేశ్ ఫోగట్ కనెక్షన్
2014 నుంచి వరుసగా హర్యాణా ఎన్నికల్లో బిజేపీ జెండా ఎగురవేస్తోంది. అయితే ఈ సారి వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీ బలం రెండింతలు పెరిగిందని హర్యాణా కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంవత్సరాల తరబడి వ్యవసాయం ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని బిజేపీకి వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ కనీస మద్దతు ధర చట్టం పై నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. నిరసన చేస్తున్న రైతులతో రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు స్నేహ సంబంధం ఉంది.

హర్యాణా ఢిల్లీ సరిహద్దుల్లోని శంభు బార్డర్ వద్ద రైతులు గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్నారు. రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలుమార్లు నిరసన చేస్తున్న రైతు నాయకులతో సంఘీభావం తెలుపుతూ శంభు బార్డర్ వద్దకు వెళ్లారు. తను రైతు బిడ్డ అని వారి పోరాటానికి మద్దతు తెలిపారు.

గత సంవత్సరం భారత దేశ్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని.. అతనికి వ్యతిరేకంగా ప్రముఖ రెజ్లర్లందరూ ఢిల్లీలో నిరసనలు చేశారు. వారిలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కూడా ఉన్నారు. అయితే ఇంతవరకూ బ్రిజ్ భూషన్ పై ప్రభుత్వం చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అతనికి టికెట్ ఇవ్వకుండా అతని కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కు టికెట్ ఇచ్చారు.

Also Read: టీచర్స్ డే కి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?.. మంచి గిఫ్ట్ ఐడియాలు ఇవిగో..

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×